గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ క్రీడల్లో ఏడో రోజూ భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. డబుల్ ట్రాప్ షూటింగ్‌లో శ్రేయసి సింగ్ స్వర్ణ పతకం సాధించింది. 50 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో ఓం మితర్వాల్‌కు కాంస్యం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం 23 పతకాలు రాగా, అందులో 12 స్వర్ణం, 4 రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
Shooter Om Mitharwal wins bronze medal for India in 50m Pistol Men's Finals #CommonwealthGames pic.twitter.com/MttQLOX8dy
— ANI (@ANI) April 11, 2018
ఆరో రోజు మంగళవారం కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ జోరు కాస్త తగ్గింది. షూటింగ్, పారా పవర్ లిఫ్టింగ్‌లో మాత్రమే పతకాలు లభించాయి. షూటింగ్ విభాగంలో హీనా సింధు(28) మూడవ స్వర్ణంతో మెరిసింది. అప్పటికే ఆమె 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో రజత పతకం సాధించడం విశేషం. పవర్ లిఫ్టింగ్‌లో సచిన్ చౌదరి కాంస్యం గెలిచాడు.
మంగళవారం మిగతా పోటీల్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాక్సింగ్‌లో ఏకంగా ఐదుగురు సెమీస్‌కు చేరి పతకాలపై ఆశలు నిలబెట్టగా, షూటింగ్‌లో గగన్ నారంగ్ నిరాశ పరిచాడు. 400 మీటర్ల రేసులో మహిళల విభాగంలో హీమా ఫైనల్ బెర్తుకు చేరడం ఊరటనిచ్చింది. స్క్వాష్ డబుల్స్‌లో దీపికా పల్లికల్ – జ్యోష్న చిన్నప్ప తొలిరౌండ్‌లో విజయం సాధించారు. భారత పురుషుల హాకీ జట్టు టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. మంగళవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొని, సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారుల సింగిల్స్ పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి.