Robin Uthappa : ఐపీఎల్ వేలంపై ఉతప్ప షాకింగ్ కామెంట్స్...ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొంటున్నారు అంటూ ఆవేదన..

Robin Uthappa:  ఐపీఎల్ వేలం విధానంపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేలానికి తాను ‘పశువు’లా వెళ్లినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 10:53 AM IST
  • ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొంటున్నారంటూ ఆవేదన
Robin Uthappa : ఐపీఎల్ వేలంపై ఉతప్ప షాకింగ్ కామెంట్స్...ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొంటున్నారు అంటూ ఆవేదన..

Robin Uthappa Sensational Comments: ఐపీఎల్ వేలంపై సీఎస్కే  బ్యాటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం (IPL Auction 2022) ప్రక్రియను చూస్తే.. సంతలో పశువులను కొంటున్న భావన కలుగుతోందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. వస్తువుల కోసం పోటీపడినట్లు ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడటం దారుణమన్నారు. వేలంలో ఓ క్రికెటర్ ని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే పర్వాలేదు కానీ..ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఊహించడానికే దారుణంగా ఉంటుందన్నాడు.  

వేలం అనేది చాలాకాలం క్రితం రాసిన పరీక్షలా అనిపిస్తుందని, ఆ తర్వాత రిజల్ట్స్  కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుందని ఉతప్ప చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ వేలం జరిగిన తీరు చూస్తే... క్రికెటర్లు కూడా మనుషులే అనే విషయాన్ని ఫ్రాంచైజీలు మరచిపోయినట్టు అనిపించిందని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఇండియాలో తప్ప ఇలా ఆటగాళ్ల వేలం ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని వ్యాఖ్యానించాడు. వేలం బదులు డ్రాప్ట్ పద్దతి అమలు చేస్తే బాగుంటుందని సూచించాడు. 

Also Read: Team India Cricketer Retirement: టీమిండియా క్రికెటర్ రిటైర్‌మెంట్.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై..

బెంగళూరులో ఇటీవల జరిగిన వేలంలో ఉతప్పను సీఎస్‌కే రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది. ఉతప్ప టీమిండియా తరపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. గతంలో కోల్‌కతా నైట్స్ రైడర్స్‌ తరుపున బరిలోకి దిగిన ఉతప్పు..గత సీజన్‌లో  చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News