Cristiano Ronaldo: పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత

Cristiano Ronaldo | పోర్చుగల్‌లో అత్యంత జనాధరణ ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లో 100 అంతర్జాతీయ గోల్స్ మార్కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నిలిచాడు.

Last Updated : Sep 9, 2020, 10:49 AM IST
  • పోర్చుగీసు ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత
  • కెరీర్‌లో 100 అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఫుట్ బాల్ ప్లేయర్
  • ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డో
Cristiano Ronaldo: పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత

పోర్చుగీసు స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అరుదైన ఘనత సాధించాడు. 100 అంతర్జాతీయ గోల్స్ (Cristiano Ronaldo 100 International Goals) కొట్టిన తొలి యూరప్ ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఫుట్‌బాల్ ఆటగాడిగా నిలిచాడు రొనాల్డో. 35 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో 165వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 45వ నిమిషంలో ఫ్రీ కిక్ గోల్ కొట్టాడు. అది అతడి కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ గోల్ కావడం గమనార్హం. AstraZeneca Vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేత 

ఇరాన్ స్టార్ ప్లేయర్ అలీ దై మాత్రమే ఇప్పటివరకూ ఈ ఘనత సాధించిన ఆటగాడిగా పేరు గాంచాడు. అలీ సైతం తన 165వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 100వ గోల్ సాధించగా.. తాజాగా రొనాల్డో సైతం 165వ మ్యాచ్‌లోనే ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. Rhea Chakraborty Arrest: అది ఆమె కర్మ.. అంకితా లోఖాండే పోస్ట్! 

ఫిఫా వరల్డ్ కప్‌లలో రొనాల్డో ఇప్పటివరకూ 7 గోల్స్ చేశాడు. యూఈఎఫ్‌ఏలో 9 గోల్స్, కెరీర్‌లో 6 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. 2003లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించిన రొనాల్డో 17ఏళ్లకు 100 గోల్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పోర్చుగల్‌లో అత్యంత ప్రజాధరణ ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతరించాడు. SRH IPL 2020 Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News