ఆస్ర్టేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్15 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే 10మందితో కూడిన భారత జట్టు (పురుషులు, మహిళలు)ను బ్యాడ్మింటన్ సంఘం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ నేతృత్వం వహించనున్నారు.
గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, స్కాట్లాండ్ తలపడనున్నాయి. ఈ క్రీడల్లో బలమైన భారత జట్టు బరిలో దిగితుండటంతో పతకాల అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సింధు, సైనాలపైనే ఆశలన్నీ. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డి.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి ప్రాతినిథ్యం వహించనున్నారు.