కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ గురురాజ పూజారీ 56 కేజీల క్లీన్ అండ్ జర్క్ విభాగంలో దేశానికి రజత పతకాన్ని అందించారు. మొదటి స్నా్చ్‌లో 107 కేజీలు ఎత్తిన పూజారీ,రెండో స్నాచ్‌లో 111 కేజీలు, మూడవ స్నాచ్‌లో 138 కేజీలు ఎత్తారు. కాగా మలేషియాకి చెందిన మహమ్మద్ అజ్రోయ్ ఇజార్ అహ్మద్ ఇదే ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్ బుధవారం రంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారణి పివి సింధు త్రివర్ణ పతాకధారిగా భారత టీమ్‌ను ముందుండి నడిపించగా.. 218 భారత అథ్లెట్లు ఆమెతో పాటు పరేడ్‌లో పాల్గొన్నారు. ఈసారి కామన్‌వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు భారీస్థాయిలోనే హాజరవుతున్నారు. గత కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలు కైవసం చేసుకొని పతకాల పట్టికలో ఐదోస్థానంలో నిలిచింది.
ఈ సారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్ షిప్‌లో శ్రీలంకను 3-0తేడాతో భారత్ ఓడించింది. మహిళల సింగిల్స్ మిక్స్‌డ్ టీమ్ గ్రూప్-ఎలో సైనా నెహ్వాల్ తన సత్తా చాటింది. శ్రీలంకకు చెందిన మదుషిక దిల్‌రుక్షిను 21-8, 21-4 తేడాతో సైనా ఓడించింది. ఇక హాకీలో భారత మహిళల జట్టు అనుకున్న స్థాయిలో ఏమీ రాణించలేదు.
తొలి మ్యాచ్‌లో వేల్స్ చేతిలో 2-3 తేడాతో భారత్ మహిళల జట్టు పరాజయం పాలైంది. అలాగే, గోల్డ్‌కోస్ట్ క్రీడాగ్రామంలో భారత కామన్‌వెల్త్ జట్టు బస చేసిన చోట సిరింజిలు కనపించడంతో...నిర్వాహకులు మన జట్టుకు వార్నింగ్ లేఖ పంపించారు.
The mighty GURURAJA comes in 2nd winning #TeamIndia its first 🥈 #Medal at the @GC2018 lifting total weight of 249kg in the Men's 56kg event! #Congratulations #TeamMalaysia & #TeamSriLanka @WeightliftingIN @Media_SAI pic.twitter.com/qgH7Aam0ls
— IOA - Team India (@ioaindia) April 5, 2018
కామన్‌వెల్త్‌లో సత్తా చాటిన గురురాజా