బాల్ ట్యాంపరింగ్: అసలు నిందితుడికి ఊరట

కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి 9 నెలల నిషేధాన్ని ఎదురుకుంటున్న ఆసీస్ ఆటగాడు కేమోరున్ బాన్‌క్రాఫ్ట్‌‌కు ఊరట లభించింది.

Last Updated : May 15, 2018, 12:40 PM IST
బాల్ ట్యాంపరింగ్: అసలు నిందితుడికి ఊరట

కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి 9 నెలల నిషేధాన్ని ఎదురుకుంటున్న ఆసీస్ ఆటగాడు కేమోరున్ బాన్‌క్రాఫ్ట్‌‌కు స్వల్ప ఊరట లభించింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ప్రీమియర్ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. 16 ప్రీమియర్ క్రికెట్ క్లబ్‌ల జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఎన్నికల్లో బాన్‌క్రాఫ్ట్ ఆడేందుకే ఎక్కవ మంది ఓటు వేయడంతో క్రికెట్ ఆస్టేలియా (సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విల్లింగ్‌టన్ క్లబ్ తరఫున బాన్‌క్రాఫ్ట్‌ క్రికెట్ ఆడనున్నారు. 

బాన్‌క్రాఫ్ట్‌తో పాటు ట్యాంపరింగ్‌కి పాల్పడిన జట్టు మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అందుకు అనుమతించిన మాజీ కెప్టెన్ స్మిత్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధించింది.  వార్నర్, స్మిత్ అభ్యర్థన మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా వీరిని దేశీయ క్రికెట్ ఆడేందుకు అనుమతించింది. ఇప్పుడు బాన్‌క్రాఫ్ట్‌ కూడా క్రికెట్ ఆడేందుకు సీఏ సరే ఆనండంతో అతనికి ఊరట లభించింది.

 

Trending News