Vinesh Phogat Retirement: కుస్తీ గెలిచింది..నేను ఓడాను రెజ్లింగ్‌కు గుడ్ బై

Vinesh Phogat Retirement: బ్రేకింగ్ న్యూస్. భారతీయ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2024, 07:15 AM IST
Vinesh Phogat Retirement: కుస్తీ గెలిచింది..నేను ఓడాను రెజ్లింగ్‌కు గుడ్ బై

Vinesh Phogat Retirement: పారిసి ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరులో అనూహ్యంగా అనర్హత వేటు పడిన రెజ్లింగ్ భారత ఆశా కిరణం వినేష్ ఫోగాట్ మరోసారి క్రీడాభిమానులకు, దేశ ప్రజలకు షాక్ ఇచ్చే నిర్ణయం ప్రకటించింది. ఒలింపిక్స్ తరువాత రెజ్లింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరులో బంగారు పతకం కోసం తలపడాల్సిన రెజ్లర్ వినేష్ ఫోగట్ అనూహ్యంగా కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే కారణంతో అనర్హురాలిగా నిలిచింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ సహా దేశమంతా ఆమెకు అండగా నిలుస్తున్నారు. దీని వెనుక కుట్ర కోణముందని నినదిస్తున్నారు. ఈ క్రమంలో వినేష్ పోగట్ సంచలన ప్రకటన చేసింది. పారిస్ ఒలింపిక్స్ తరువాత రెజ్లింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆమె స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 

వినేష్ ఫోగట్ మాటల్లో

రెజ్లింగ్ నాపై విజయం సాధించింది. నేను ఓడిపోయాను. నేను ధైర్యం కోల్పోయాను. ఇక నాకు అంత శక్తి లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024.

29 ఏళ్ల భారతీయ అథ్లెట్ తన విచారాన్ని, కృతజ్ఞతని వ్యక్తపర్చింది. కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నా అభిమానులకు క్షమాపణలు. ఇంతకాలం మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. 2001లో మొదలైన కెరీర్‌కు ఇక గుడ్ బై అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అందరినీ ఆవేదనకు గురి చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఊహించని విధంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటన చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.

ఇవాళ తీర్పు ఇవ్వనున్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌

50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లిన వినేష్ ఫోగట్ అనూహ్యంగా కేవలం 100 గ్రాముల బరువు తక్కువగా ఉందనే కారణంతో అనర్హురాలిగా నిలిచింది. ఇది ఆమెను ఎంతగానో నిరాశపరిచింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు అప్పీల్ చేసింది. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇవాళ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈలోగా రెజ్లింగ్‌కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకుంది వినేష్ ఫోగట్. 

Also read: Vinesh Phogat: కోచ్, న్యూట్రిషనిస్ట్ లపై అనుమానాలు.. బాంబు పేల్చిన భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News