Business Ideas: మహిళలకు లక్కీ ఛాన్స్ ..ఇల్లు కదలకుండా రోజుకు 5000 రూపాయలు సంపాదించే బిజినెస్ ఐడియా

Small Business Ideas: మహిళలు మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకుంటున్నారా. మీ ఇంట్లో ఖర్చులకు చేదోడు వాదోడుగా నిలవాలి అనుకుంటున్నారా. మీ భవిష్యత్తుకు భరోసానిచ్చేలా సంపాదన చేపట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే చదువుతో సంబంధం లేకుండానే మీరు ఇంటి వద్ద ఉండి పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /5

ఈ మగ్గం వర్క్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. సెంటీ మీటర్లు, ఇంచుల చొప్పున డబ్బులు వసూలు చేస్తారు. ఈ డిజైన్ వేయడం చాలా నైపుణ్యంతో కూడిన పని అయితే మెటీరియల్ కన్నా కూడా పనితీరుకే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తారు. ఎంత ఖర్చయినప్పటికీ కస్టమర్లు మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ డిజైన్ వేయించుకునేందుకు మక్కువ చూపిస్తారు. అంతటి ఆకర్షణ ఈ పనితనంలో ఉంది. అయితే ఇంతటి డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ లో మీరు ప్రవేశిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ మగ్గం డిజైన్ వర్క్స్ మీరు నేర్చుకోవడం ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు ఈ మగ్గం డిజైన్ వర్క్స్ ఎక్కడ నేర్పిస్తారు. కోర్సు ఫీజు ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం.

2 /5

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో యువతి యువకులకు ఉపాధి శిక్షణను అందిస్తున్న ప్రభుత్వ సంస్థ సెట్విన్. మగ్గం వర్క్ డిజైనింగ్ కోర్స్ కూడా నేర్పిస్తోంది. ఈ కోర్సు ఫీజు కేవలం 2000 రూ.లు మాత్రమే. ఈ కోర్సు నేర్చుకున్న అనంతరం పీకు సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు. తద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ గా బయటకు వస్తారు. మూడు నెలల పాటు ఉండే ఈ కోర్సులో చేరేందుకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు.

3 /5

ఈ కోర్సు అనంతరం మీరు సొంతంగా మగ్గం వర్క్స్ ప్రారంభించవచ్చు. లేదా మంచి పేరున్న ప్రతిష్టాత్మకమైన బోటిక్స్ లో పనిచేయవచ్చు ఈ కోర్సు అనంతరం మీరు సొంతంగా ఇంటి వద్ద కూడా మగ్గం ఏర్పాటు చేసుకొని ఆర్డర్లను పొందవచ్చు.

4 /5

సొంతంగా ఇంటి వద్ద కూడా మీరు ఆర్డర్లు పొంది మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఆధారంగా లెక్కించినట్లయితే, మగ్గం వర్క్ చేయడం ద్వారా ప్రతినెల 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.  

5 /5

పెళ్లిళ్ల సీజన్లో ఇది మరింత గిరాకీతో ఉన్న వ్యాపారంగా చెప్పవచ్చు. మీరు సంస్థలో ఉపాధి శిక్షణ పొందిన అనంతరం సొంత కాళ్లపై నిలబడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం కొద్ది మంది మాత్రమే ఈ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన మగ్గం వర్కర్లతోనే పని కానిస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.