SRH vs RR: ఐపీఎల్ 2022 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఓ వైపు ఓటమి..మరోవైపు బీసీసీఐ భారీ జరిమామా కూడా విధించింది.
ఐపీఎల్ 2022 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఔట్ విషయంలో ఇప్పటికే సందేహాలు ఉన్నాయి. రీప్లేలో స్పష్టంగా అవుట్ కాదని తెలుస్తున్నా..ఎంపైర్ అవుట్ ప్రకటించడంపై విలియమ్సన్‌తో పాటు అభిమానులు కూడా నిరాశ చెందారు. చెత్త ఎంపైరింగ్ అంంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం బీసీసీఐ..ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు జరిమానా విధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. ఈ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఆ తరువాత లక్ష్యాన్ని ఛేదించలేక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విఫలమైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు స్లో ఓవర్ రేట్ కారణంగా..జట్టు కెప్టెన్ విలియమ్సన్‌కు బీసీసీఐ 12 లక్షల జరిమానా విధించింది. కేటాయించిన నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువ వేసినందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.
Also read: IPL 2022 Match 6: బెంగుళూర్ వర్సెస్ కోల్ కతా.. బోణి కొట్టాలని చూస్తున్న ఆర్సీబీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook