Asia Cup 2022: టీమిండియా తదుపరి కెప్టెన్‌ హార్దిక్ పాండ్యానే..భారత మాజీ ప్లేయర్ జోస్యం..!

Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Written by - Alla Swamy | Last Updated : Aug 31, 2022, 03:09 PM IST
  • ఆసియా కప్ 2022
  • తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం
  • హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Asia Cup 2022: టీమిండియా తదుపరి కెప్టెన్‌ హార్దిక్ పాండ్యానే..భారత మాజీ ప్లేయర్ జోస్యం..!

Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లలో టీమిండియా విజయాన్ని అందుకుంది. భారత విజయంలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్‌లో సిక్సర్ బాది విజయాన్ని అందుకున్నాడు. ఈసందర్భంగా అతడిపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాండ్యాపై పొగడ్తల వర్షం కురిపించాడు. అతడు తప్పకుండా తదుపరి టీమిండియా కెప్టెన్ అవుతాడని తెలిపాడు. గాయాల నుంచి కోలుకుని అద్భుత ఆడుతున్నాడని అభిప్రాయ పడ్డాడు. ఆసియా కప్‌..భారత్‌దేనని జోస్యం చెప్పాడు. త్వరలో టీమిండియా బాధ్యతలు తీసుకుంటాడని..అది చూస్తానని స్పష్టం చేశాడు హర్భజన్ సింగ్. ఇటీవల అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడని..ఐపీఎల్ తర్వాత ఆట మారిపోయిందన్నాడు.

టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు హార్దిక్ పాండ్యాకు అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. పాండ్యాలో మరో కోణం చూస్తున్నామని..ధోనీలా మారుతున్నాడని..కూల్‌గా, స్థిరంగా ఆడుతున్నాడని తెలిపాడు. బ్యాటింగ్‌లోనూ వైవిద్యం కనిపిస్తోందన్నాడు హర్భజన్ సింగ్. మన సామర్థ్యంపై మనకు విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవొచ్చని స్పష్టం చేశాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావాలి..తప్పకుండా అయి తీరుతాడని తేల్చి చెప్పాడు.

మొన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శన కనపరిచాడు. బౌలింగ్‌లో 25 పరుగులు ఇచ్చి..మూడు కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయాడు. తీవ్ర ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ ఆడి విజయాన్ని అందించాడు. ఆ సిక్సర్‌తో మళ్లీ ధోనీ వచ్చాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోనీ సిక్సర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. 

Also read:MLC Kavitha: విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..కవిత ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు..!

Also read:Asia Cup 2022: ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్ సూపర్ షో..ప్రపంచ రికార్డు సాధించిన నజీబుల్లా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News