స్కీయింగ్ పోటీల్లో భారత్‌కు తొలి మెడల్

మనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ స్కీయింగ్ పోటీల్లో భారత్‌కు తొలి మెడల్ అందించారు. 

Last Updated : Jan 10, 2018, 03:34 PM IST
స్కీయింగ్ పోటీల్లో భారత్‌కు తొలి మెడల్

మనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ స్కీయింగ్ పోటీల్లో భారత్‌కు తొలి మెడల్ అందించారు. టర్కీలో జరుగుతోన్న అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించారు. జనవరి 6 నుండి 9వ తేదీ వరకు ఈ పోటీలు టర్కీలో జరిగాయి. ఈ పోటీల్లో ఆంచల్ కాంస్య పతకాన్ని పొందారు. స్కీయింగ్‌లో తొలిసారిగా భారత్‌కు పతకాన్ని తీసుకొచ్చిన ఆంచల్ పై ఇప్పటికే కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంస వర్షం కురిపించారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. టర్కీలో ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డీస్కీ(ఎఫ్‌ఐఎస్‌) ఆధ్వర్యంలో ఆల్‌పైన్‌ ఎజ్డర్‌ 3200 కప్‌ పేరుతో స్కీయింగ్ టోర్నీ నిర్వహించారు. ఆ టోర్నిలో భారత క్రీడాకారిణి తన సత్తా చాటి క్రీడా చరిత్రలోనే తొలిసారిగా భారత్‌కు ఈ క్రీడాంశంలో పతకాన్ని అందించారు. 

 

Trending News