Ganesh Chaturthi 2022: దేశవ్యాప్తంగా వినాయక చవితిని రేపు అంటే ఆగస్టు 31, 2022న ఘనంగా జరుపుకోనున్నారు. ఈ పండుగ (Ganesh Chaturthi 2022)10 రోజుల పాటు జరుగనుంది. ఈ ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరూ వినాయకుడిని తమ ఇంటికి తీసుకువచ్చి పూజిస్తారు. అనంత చతుర్ధశి రోజున అంటే పదో రోజున వినాయక నిమజ్జనం చేస్తారు. కొందరు వారి సౌలభ్యం ప్రకారం, 3, 5, 7, 9 రోజులకు కూడా గణపతి నిమజ్జనం చేస్తారు. అయితే వినాయకుడి జన్మకు సంబంధించిన ఆసక్తికర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయకుడి జననం
ఒకనాడు కైలాసంలో శివుడి రాక కోసం పార్వతీదేవి ఎదురుచూస్తుంది. అయితే ఈ లోపు నలుగు పిండితో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణప్రతిష్ట చేస్తుంది. స్నానం చేసి వస్తానని చెప్పి ఆ బాలుడిని తన గుమ్మం ముందు కాపలా పెట్టింది పార్వతీమాత. ఆ చిన్నారి బాలుడు వాకిలి వద్ద కాపలా కాస్తున్నాడు. ఇంతలో మహాదేవుడు ద్వారం వద్దకు వచ్చాడు. ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు కోపించి ఆ బాలుని శిరస్సును ఖండించాడు. దీంతో విషయం తెలిసి పార్వతి హతాశురాలైంది. అప్పుడు ఉత్తర దిక్కున ఉన్న గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు శివుడు. ఇలా వినాయకుడి జననం జరిగింది.
గణపతి విశిష్టత
వినాయకుడు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఫేమస్. నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో గణపతిని ఎక్కువగా పూజిస్తారు. వినాయకుడిని ఆరాధించినదే ఏ పూజ లేదా కార్యక్రమం మెుదలపెట్టరు. గణపతికి 108 పేర్లు ఉన్నాయి. వినాయకుడిని 21 పత్రాలతో పూజిస్తారు. గణపతి ఆరాధాన గుప్తుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందింది. మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్తూండగా రాసింది వినాయకుడే. ఇతడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు కలరు. ఇతడి వాహనం మూషికం. దేశవ్యాప్తంగా మన చిత్తూరు జిల్లాలో గల కాణిపాకం వినాయకుడి చాలా ఫేమస్.
Also Read: Krishna's Dwaraka Real or Fake: కృష్ణుడి ద్వారక నిజంగానే ఉందా లేక ఫేకా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook