Ganapati Puja: గణపతిని ప్రతిష్ఠించిన 10 రోజుల తరువాత నిమజ్జనం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే గణపతి విసర్జనం ఎందుకు చేస్తారు, పదిరోజుల తరువాత ఎందుకుంటుందనే వివరాలు తెలుసుకుందాం..
దేశమంతా గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. బొజ్జ గణపతిని పూర్తి భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో, ప్రేమతో ప్రతిష్టిస్తుంటారు. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం కూడా అదే స్థాయిలో నిర్వహిస్తారు. నిమజ్జనం లేకుండా గణేశ్ ఉత్సవాలు పూర్తి కావు. భాద్రపదంలోని శుక్లపక్షం చతుర్ధీ తిధి నాడు గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 10 రోజుల తరువాత అనంత చతుర్ధశి నాడు గణేశుడిని నిమజ్జనం చేస్తారు. వినాయకుడిని నిమజ్జనం చేసిన 11వ రోజు అనంత చతుర్దశి నాడు ప్రవహిస్తున్న నది లేదా చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అయితే గణేశుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఆ వివరాలు మీ కోసం..
గణేశ్ చతుర్ధి నాడు గణపతిని ప్రతిష్ఠించేందుకు విగ్రహానికి విభిన్న రకాలుగా పూజాది కార్యక్రమాలు, ఆరాధన చేస్తారు. గణపతి చతుర్ధి నుంచి అనంత చతుర్దశి వరకూ సద్గుణ సాకారంగా ఉంటుంది. ఈ సందర్భంగా భక్తులు తమ తమ కోర్కెల్ని గణపతి చెవుల్లో చెబుతారు. ఆ తరువాత ఈ విగ్రహాన్ని చతుర్దశి నాడు నీళ్లలో, నదిలో, చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. తద్వారా గణపతి భూలోకపు సద్గుణ సాకారం నుంచి విముక్తుడై..నిర్గుణ నిరాకారరూపంలో దేవలోకానికి చేరుతారు. ఆ తరువాత భూలోకంలో భక్తుల కోర్కెల్ని విభిన్న దేవతలకు చెప్పి ఆ కోర్కెల్ని పూర్తి చేయిస్తారని నమ్మకం.
మతగ్రంధాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారత్ కధను గణేశుడికి గణేశ్ చతుర్ది నుంచి అనంత చతుర్దశి వరకూ 10 రోజులు విన్పించాడు. వేదవ్యాసుడు కధ చెబుతున్నప్పుడు అతను కళ్లు మూసుకుని ఉండటంతో ఆ కధ ప్రభావం గణేశుడిపై ఎలా పడిందో తెలియలేదు. వేదవ్యాసుడు కధ పూర్తి చేసి..కళ్లు తెరిచినప్పుడు పదిరోజుల పాటు కధ వినడం వల్ల గణేశుడిలో వేడి పెరిగి..జ్వరం వచ్చేసింది. దాంతో వేదవ్యాసుడు గణేశుడిని సమీపంలోని ఓ చెరువుకు తీసుకెళ్లి మునక వేయించాడు. దాంతో వినాయకుడి వేడి తగ్గుతుంది. అందుకే వినాయకుడిని ప్రతిష్ఠించిన 10 రోజుల వరకూ భక్తుల కోర్కెలు వినీ వినీ గణపతి వేడి పెరిగిపోతుంటుంది. చతుర్దశినాడు చెరువు, నది లేదా సముద్రంలో నిమజ్జనం చేయడం ద్వారా కూల్ చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook