Vastu Tips In Telugu: వేద జ్యోతిష్య, వాస్తు శాస్త్రంలో ఉదయం లేవడానికి ముందు రాత్రి పడుకునే ముందు చేయాల్సిన కొన్ని పనుల గురించి క్లుప్తంగా వివరించారు. కొంతమంది ఉదయం లేచిన తర్వాత చెయ్యకూడని పనులు చేస్తున్నారు. దీనివల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాస్తు శాస్త్రంలో తెలిపారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆనందం, సంతోషం కోసం..
సనాతన ధర్మంలో అనేక విషయాల గురించి క్లుప్తంగా వివరించారు అయితే ఉదయం లేచిన వెంటనే తల స్నానం చేసి పూజా గదిలో ఉన్న దేవతా విగ్రహాల ముందు దీపాన్ని వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ దీపాన్ని జ్ఞానానికి వెలుగుగా సూచిస్తారు. కాబట్టి ఆ దేవతల అనుగ్రహం లభించి జ్ఞానం రెట్టింపు అవుతుంది. దీంతోపాటు జీవితంలో సుఖసంతోషాలు కూడా పెరుగుతాయని కుటుంబంలో వస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని సనాతన ధర్మంలో పేర్కొన్నారు.
ఉదయం పూట లేచిన వెంటనే చేయాల్సిన పనులు..
ఉదయం లేచిన వెంటనే చాలామంది అద్దంలో ముఖం చూసుకుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మీ అరిచేతను చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అరచేతిని మత విశ్వాసాల ప్రకారం శుభంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం రెండు కళ్ళతో మీ అరచేతిని చూడడం వల్ల రోజంతా అనుకూల శక్తిని పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ జాతకంలోని సూర్యుడి స్థానం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎల్లప్పుడూ సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని ఒక నమ్మకం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
రాత్రి పడుకునే ముందు ఈ పనులు తప్పకుండా చేయండి..
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు హనుమాన్ చాలీసాను పాటించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ నుంచి ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయి. దీంతోపాటు అనుకున్న పనులు కూడా జరుగుతాయని కొందరి నమ్మకం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి