Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రం నిత్య జీవితంలో ఎన్నో అంశాల గురించి క్లుప్తంగా పేర్కొంది. ముఖ్యంగా ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చెబుతారో కూడా ఈ శాస్త్రంలో ఎంతో క్లియర్ గా పేర్కొన్నారు. అలాగే ఇంటి ముందు ఇంటి వెనకాలనాటే మొక్కల గురించి కూడా వాస్తు శాస్త్రంలో తెలిపారు. నిజానికి ఈ శాస్త్రం ప్రకారం, ఇంట్లో పెట్టుకునే కొన్ని మొక్కలు జీవితంలో ఎంతో భారాన్ని తెచ్చి పెడతాయి. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచేందుకు కూడా అవి కీలక పాత్ర పోషిస్తాయి. చూడడానికి ఆ మొక్కలు ఎంతో అందంగా ఉన్నప్పటికీ అనేక రకాల అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టే ఛాన్స్ కూడా ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి జాతులకు సంబంధించిన మొక్కలు ఉండడం దుష్ప్రభావాలకు దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
చింత మొక్క:
గ్రామాల్లో చాలామంది ఇళ్లలో చింత మొక్కను పెంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చింతమొక్క ఉండడం వల్ల అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ప్రతికూల శక్తి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఈ మొక్క ఇతర సమస్యలకు కూడా దారి తీయవచ్చు.
బోన్సాయ్ మొక్క:
మనం ఈ మొక్కను తరచుగా ఆఫీసుల్లో లేదా లగ్జరీ ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఇది చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఈ బోన్సాయ్ చెట్టును ఇంట్లో పెంచడం వల్ల అనేక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో ఈ మొక్కలను ఉంచడం వల్ల అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది వృత్తిపరంగా కూడా దెబ్బతీస్తుంది. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ మొక్కని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు.
కాక్టస్ మొక్కలు:
ఇంటిని డెకరేషన్ చేసుకునే భాగంలో చాలామంది ఈ కాక్టస్ మొక్కలు అతిగా వినియోగిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క కూడా ఇంట్లో ప్రతికూలతను స్ప్రెడ్ చేస్తుంది. అంతేకాకుండా అనుకూల శక్తిని ఆకర్షించి ఇంట్లో ప్రతికూల శక్తిని తీవ్రంగా పెంచుతుంది. అలాగే ఇది ఆఫీసుల్లో ఉండడం వల్ల అనేక సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. దీంతోపాటు ఇంట్లో ఈ మొక్కను ఉంచడం వల్ల కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
పత్తి మొక్క:
ప్రస్తుతం చాలామంది పిల్లలు పత్తి మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కలు కూడా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీవ శాస్త్రం ప్రకారం అనేక రకాల ప్రతికూల శక్తులను ఇంట్లో పెంచుతుంది. అలాగే ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చెట్టు ఇంట్లో ఉంటే తీసేయడం ఎంతో మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం పై మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఇవే కాకుండా అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టినట్లే..