Budh Margi 2023: బుధుని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారు కొత్త సంవత్సరంలో నోట్ల కట్టలతో ఆడుకుంటారు!

Scorpio, Aquarius and Pisces zodiac signs peoples will play with bundles of notes in New Year 2023. 2023లో జనవరి 13న నేరుగా సంచారం (ధనుస్సు రాశిలో బుధ సంచారం)చేయబోతున్నాడు. ఈ సంచారం చాలా రాశుల వారికి మేలు జరుగుతుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Dec 31, 2022, 02:16 PM IST
  • బుధుని ప్రత్యక్ష సంచారం
  • ఈ 3 రాశుల వారు నోట్ల కట్టలతో ఆడుకుంటారు
  • విదేశీ పర్యటనకు కూడా వెళ్లవచ్చు
Budh Margi 2023: బుధుని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారు కొత్త సంవత్సరంలో నోట్ల కట్టలతో ఆడుకుంటారు!

These 3 zodiac signs will play with bundles of notes in New Year due to Mercury Direct Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. మేధస్సు, తర్కం, సంభాషణ, గణితం, తెలివి మరియు స్నేహితులకు కారకంగా బుధుడు పరిగణించబడ్డాడు. బుధుని మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. బుధుని కదలికలు చాలా వేగంగా ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బుధుడు డిసెంబర్ 2022లో రెండుసార్లు సంచరించాడు. 2023లో జనవరి 13న నేరుగా సంచారం (ధనుస్సు రాశిలో బుధ సంచారం)చేయబోతున్నాడు. ఈ సంచారం చాలా రాశుల వారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఓ మూడు రాశుల వ్యక్తుల వృత్తిలో పురోగతి మరియు వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆ రాశులు ఏవో ఓసారి చూద్దాం. 

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి బుధుని ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. బుధుడు ప్రత్యక్ష దిశలో ఉండడం వల్ల వ్యాపారులకు మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వ్యాపారులు పెద్ద డీల్ పొందవచ్చు. ఈ రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. మీడియా మరియు మార్కెటింగ్ వ్యక్తులు బలమైన ప్రయోజనాలను పొందుతారు. విదేశీ పర్యటనకు కూడా వెళ్లవచ్చు.

కుంభ రాశి:
బుధ సంచారం వలన కుంభ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఆదాయం పెరగడంతో ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు మెండుగా  ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉంటుంది. కొత్త ఏడాదిలో నోట్ల కట్టలతో ఆదుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మీన రాశి:
మీన రాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పెద్ద విజయం మీ సొంతమవుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది. చాలా ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులు పురోభివృద్ధి పొందుతారు.కొత్త జాబ్ ఆఫర్ కూడా అందుకోవచ్చు. వ్యాపారులకు లాభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. 

Also Read: Shahid Afridi Daughter Marriage: అంగరంగ వైభవంగా షాహిద్ అఫ్రిదీ కూతురు పెళ్లి.. పెళ్లికొడుకు షాహిన్‌ ఆఫ్రిదీ కాదు!  
Also Read: Rishabh Pant Car Accident: మీరు రియల్ హీరో.. పంత్‌ను కాపాడిన బస్ డ్రైవర్‌పై మాజీ లెజెండ్ ప్రశంసలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News