Rajayogam: న్యూ ఇయర్ కు ముందు పవిత్రమైన యోగం.. ఈ 3 రాశులపై కుంభవృష్టిగా డబ్బు వర్షం..

Mangal Gochar 2023: డిసెంబరు చివరిలో గ్రహాల కమాండరైన అంగారకుడు తన రాశిని మార్చి సూర్యుడితో కలిసి అరుదైన యోగాన్ని చేస్తున్నాడు. ఈ శుభకరమైన యోగం వల్ల ఈ 3 రాశులవారి కెరీర్ దూసుకుపోనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2023, 11:31 AM IST
Rajayogam: న్యూ ఇయర్ కు ముందు పవిత్రమైన యోగం.. ఈ 3 రాశులపై కుంభవృష్టిగా డబ్బు వర్షం..

Surya Mangal Yuti in Dhanu 2023: గ్రహాల కమాండరైన అంగారకుడు ఈ నెల చివరిలో రాశిని మార్చబోతున్నాడు. డిసెంబరు 28న కుజుడు ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. అయితే ఇప్పటికే అదే రాశిలో గ్రహాల రాజు సూర్యుడు సంచరిస్తున్నాడు. ధనస్సు రాశిలో వీరిద్దరి కలయిక వల్ల ఆదిత్యమంగళ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 2023 చివరాంతం మరియు 2024కు ముందు ఈ యోగం ఏర్పడటం కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం. 

ధనస్సు రాశి
సూర్యుడు మరియు కుజుడు కలయిక వలన ఏర్పడిన ఆదిత్య మంగళ యోగం ధనస్సు రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది, అంతేకాకుండా ఇది పెళ్లి కూడా దారి తీస్తుంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు పని దొరుకుతుంది. 
మిథునరాశి
ఆదిత్య మంగళ రాజయోగం మిథున రాశి వారి దైర్యసాహసాలు పెరుగుతాయి. దీంతో ఈరాశి వ్యక్తులు ఏ పనినైనా సులభంగా పూర్తిచేస్తారు. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. 
సింహ రాశి
ఆదిత్య మంగళ రాజయోగం వల్ల సింహ రాశి వారు కొత్త సంవత్సరంలో శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read: Mars Rise 2024: నూతన సంవత్సరంలో ఈ 4 రాశులవారిపై కనక వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News