Surya Grahan 2023: సూర్యగ్రహణం ఎవరికి కలిసి వస్తుందో, ఎవరికి కలిసిరాదో తెలుసుకోండి?

Solar Eclipse 2023: ఈ నెల 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మెుత్తం 12 రాశులపై ప్రబావాన్ని చూపుతుంది. ఈ గ్రహణం ఏ రాశులవారికి కలిసి వస్తుంది. ఎవరిపై ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 07:56 PM IST
Surya Grahan 2023: సూర్యగ్రహణం ఎవరికి కలిసి వస్తుందో, ఎవరికి కలిసిరాదో తెలుసుకోండి?

Surya Grahan 2023: హిందూ మతంలో సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం ప్రజలందరిని ప్రభావితం చేస్తుంది. సూర్యుడు మరియు భూమి మధ్యకు చంద్రుడు రావడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇప్పుడు ఏర్పడబోయే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

సూర్యగ్రహణం ఈరాశులకు అశుభం
అయితే ఇప్పుడు ఏర్పడబోయే సూర్యగ్రహణం మేషం, ధనుస్సు, మకరం మరియు మీన రాశుల వారికి అశుభం కానుంది. అయితే ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి. మీరు మానసిక ఆందోళకు గురయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారవచ్చు. 

Also read: Chandra Grahan 2023: మే 5న తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..!

సూర్యగ్రహణం ఈ రాశులకు శుభం
సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మేషరాశిలో కూర్చుంటాడు. ఏదైనా రాశిలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటే, అది వారికి చాలా శుభప్రదంగా భావిస్తారు. సూర్యుడి యెుక్క ఈ ఉచ్ఛస్థితి కారణంగా కర్కాటకం, కుంభం మరియు వృశ్చిక రాశులవారు ప్రయోజనం పొందుతారు. మీరు వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 

Also Read: Shukra Gochar 2023: 10 ఏళ్ల తర్వాత వృషభరాశిలో 'మహా ధన రాజయోగం'.. ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News