Solar Eclipse 2022: కొన్ని గంటల్లో సూర్యగ్రహణం.. ఈ రాశులవారిపై డబ్బు వర్షం...

Solar Eclipse 2022: కొన్ని గంటల్లో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 04:27 PM IST
Solar Eclipse 2022: కొన్ని గంటల్లో సూర్యగ్రహణం.. ఈ రాశులవారిపై డబ్బు వర్షం...

Surya Grahan Positive Impact on Zodiacs: సూర్యగ్రహణానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు అంటే అక్టోబరు 25న శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ అమావాస్య మంగళవారం రోజున కేతు గ్రస్త సూర్య గ్రహణం (Surya Grahan 2022) ఏర్పడనుంది. ఇది మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ ఏడాది మెుదట్లో సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడింది. ఇది భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు ఏర్పడబోయే సూర్యగ్రహణం ఈ ఏడాది చివరది మరియు ఇండియాలో కనిపిస్తుంది.  ఇవాళ కనిపించబోయే పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మెుత్తం 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇది కొన్ని రాశులవారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సూర్యగ్రహణం ఈ రాశులకు ప్రయోజనం.
మేషరాశి (Aries) : సూర్యగ్రహణం వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. లక్ష్మీదేవి కటాక్షం వీరిపై ఎల్లప్పుడు ఉంటుంది. దుబారా ఉండదు. మెుత్తానికి ఈ సమయం మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. 
సింహా రాశి  (Leo): ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు ఈ సమయంలో ఏదైనా ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. లావాదేవీలకు ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 
కన్య రాశి (Virgo) :  లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశంఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
తుల రాశి (Libra) : ఈ రాశి వారు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరు భారీ మెుత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థికంగా వీరి పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
వృశ్చిక రాశి (Scorpio) :  సూర్యగ్రహణం వల్ల ఈ రాశివారికి ధనలాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. లక్ష్మీదేవి కృప వీరిపై ఉంటుంది. 

Also Read: Mercury Transit 2022: రేపు తులరాశిలోకి బుధుడు... ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News