Surya Gochar 2023: ఫిబ్రవరి 13 వరకు మకరరాశిలోనే సూర్యభగవానుడు.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..

Surya Gochar 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని రాశులవారిపై డబ్బు వర్షం కురిపిస్తున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 06:30 PM IST
Surya Gochar 2023: ఫిబ్రవరి 13 వరకు మకరరాశిలోనే సూర్యభగవానుడు.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..

Surya Gochar 2023: సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. మత విశ్వాసాల ఆధారంగా, మనం ప్రతి గ్రహాన్ని దేవుడిగా కొలుస్తాం. సూర్యగ్రహాన్ని సూర్యదేవుడు అని పిలుస్తారు. గ్రహాల గమనంలో మార్పు మానవ జీవితంపై పెను ప్రభావాన్ని  చూపుతాయి. కింగ్ సూర్య ఈ నెల 14న మకరరాశిలోకి ప్రవేశించాడు. అదే రాశిలో ఫిబ్రవరి 13 వరకు ఉంటాడు. ఈ సమయంలో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం 
మీనరాశి (Pisces)
ఈ రాశివారికి ఫిబ్రవరి 13 వరకు అద్భుతంగా ఉంటుంది. సూర్య సంచారం వల్ల వీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. పెట్టుబడిలో లాభం ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. 
మేషరాశి (Aries)
సూర్యుని మార్పు మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరగడంతోపాటు బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. 
సింహరాశి (Leo)
సూర్య రాశిలో మార్పు వల్ల ప్రయోజనం పొందే మూడవ రాశి సింహరాశి. ఈరాశికి అధిపతి సూర్య భగవానుడే. ఈ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో సూర్య దేవుడు సంచరించాడు. దీంతో వీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.

Also Read: Budhaditya Rajyog: మకరంలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News