Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. మీ జాతకంలో సూర్యదేవుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. విజయాన్ని ఇచ్చే ఆదిత్యుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వచ్చే నెలలో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న భానుడు ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మే 14 వరకు సూర్యుడు ఈ రాశిలోనే ఉంటాడు. దీని తరువాత అతను వృషభ రాశికి వెళ్తాడు. సూర్యభగవానుడి ఈ రాశి మార్పు కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందనున్నారు.ఆ రాశులేంటో తెలుసుుందాం.
సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
సింహ రాశి (Leo)
సూర్యుడి రాశి మార్పు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీకు తండ్రి సపోర్టు లభిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి.
కర్కాటక రాశి (Cancer)
సూర్యుడి మేష రాశి ప్రవేశం కర్కాటక రాశి వారికి అనేక ప్రయోజనాలను ఇవ్వనుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి నిరీక్షణకు తెరపడుతుంది. బిజినెస్ పెరుగుతుంది.
మిథున రాశి (Capricorn)
సూర్యుని యొక్క ఈ సంచారం మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు వచ్చి చేరుతుంది. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.
Also Read: Grah Gochar 2023: రేవతి నక్షత్రంలో కలుసుకున్న బుధుడు-బృహస్పతి.. ఈ 6 రాశుల ఇంటిపై నోట్ల వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి