Surya Gochar 2023: సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి సూర్యభగవానుడు... ఈరాశుల వారికి లాభాలు బోలెడు..

Surya Gochar 2023: సెప్టెంబరు 17న సూర్యభగవానుడు కన్యారాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 12:49 PM IST
Surya Gochar 2023: సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి సూర్యభగవానుడు... ఈరాశుల వారికి లాభాలు బోలెడు..

Sun transit 2023 effect: సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. భాస్కరుడిని గౌరవానికి, విజయానికి సూచికగా భావిస్తారు. మరో 5 రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 17న సూర్యుడు కన్యారాశిలోకి (Sun transit 2023 in Virgo) ప్రవేశించబోతున్నాడు. కన్యారాశికి అధిపతిగా బుధుడిని భావిస్తారు.  సూర్యుడిని, బుధుడిని మిత్రులుగా భావిస్తారు. కన్యారాశిలో సూర్యభగవానుడు సంచారం మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. 

మీన రాశి
భాసర్కుడి సంచారం మీనరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ జాతకంలోని ఏడో ఇంట్లో సూర్యుడు సంచరించనున్నాడు. లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీకు త్వరలో పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 
కర్కాటక రాశి
సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. భాస్కరుడు ఈ రాశి యెుక్క మూడో ఇంట్లో సంచరించబోతున్నాడు. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ఊహించని డబ్బు పొందుతారు. 
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో పదవ ఇంట్లో సూర్యదేవుడు సంచరిస్తున్నాడు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Also read: Masik Shivaratri: మాస శివరాత్రి రోజున ఇలా చేస్తే శని, రాహు దోషాలు తొలగిపోతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News