Sun Transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఇతడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. భానుడిని తండ్రి, ఆత్మ, ఉద్యోగం మరియు విజయానికి కారకుడిగా భావిస్తారు. మే 14న సూర్యుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. వృషభరాశిలో సూర్యుడు ప్రవేశం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి
వృషభరాశిలో సూర్యుడు సంచారం వల్ల మేషరాశి వారు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారి జాతకంలోని సంపద ఇంట్లో ఆదిత్యుడు కూర్చుంటాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగుల జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది.
సింహరాశి
సింహ రాశికి అధిపతి సూర్యభగవానుడు. భానుడు రాశి మార్పు కారణంగా మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ కూడా దక్కే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. బిజినెస్ చేసేవారు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం చేస్తున్న గురుడు.. ఈ 5 రాశులపై డబ్బు వర్షం..
కన్య రాశి
సూర్యుని యొక్క ఈ సంచారం మీ జాతకంలోని తొమ్మిదవ ఇంట్లో జరగబోతుంది. దీంతో మీ అదృష్టం ప్రకాశించనుంది. విదేశాల్లో చదవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగ మరియు వృత్తిలో మీరు ప్రయోజనం పొందుతారు.
Also Read: Shukra Gochar 2023: మే 02 నుండి ఈ రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook