Sun transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారినట్టే సూర్యుడు కూడా నెలకోసారి ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాడు. అక్టోబర్ నెలలో గ్రహాల రారాజుగా పిల్చుకునే సూర్యుడి స్థితిలో కీలక మార్పు ఉండనుంది. ఆ కీలకమైన మార్పులేంటో తెలుసుకుందాం..
అక్టోబర్ 14వ తేదీన కన్యా రాశిలో సూర్యుడి గ్రహణం ఉంటుంది. ఆ తరువాత తులా రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ రాశిలో సూర్యుడు 30 రోజులుంటాడంటారు. సూర్యుడి ఈ మార్పుల కారణంగా అక్టోబర్ నెల అత్యంత కీలకంగా మారింది. అక్టోబర్ నెలలో అశ్విని అమావాస్య రోజున సూర్య గ్రహణం ఉంది. సూర్య గ్రహణానికి 4 రోజుల తరువాత అంటే అక్టోబర్ 18వ తేదగీన సూర్యుడి తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. కానీ కొన్ని రాశులకు మాత్రం ఊహించని లాభాలు కల్గించనుంది.
మకర రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో కీలకమైన మార్పు సంభవించనుంది. కెరీర్‌పరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో ఊహించని మార్పు సంభవిస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు అమితమైన లాభాల్ని ఆర్జిస్తారు.
మీన రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో అంతా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్ధికంగా ఎలాంటి సమస్య తలెత్తదు. మీ సామర్ద్యం మెరుగుపడుతుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి,. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సూర్యుడి తులా రాశి ప్రవేశంతో వృషభ రాశి జాతకులకు సానుకూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనంతో విశేషమైన లాభాలు కలగనున్నాయి. అక్టోబర్ 18 నుంచి ఈ రాశి వారికి అదృష్టం తోడుగా ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.
సింహ రాశి జాతకులకు సూర్యుడి గోచారంతో అంతా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు చాలా మంచి సమయంగా భావిస్తారు. పెట్టుబడులు లాభాలు అందిస్తాయి. షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. ఆకశ్మిక లాభాలు ఆర్జిస్తారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు.
ధనస్సు రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదే సమయంలో పనిచేసేచోట గుర్తింపు లభిస్తుంది. సూర్యుడి గోచారంతో ఆనందం ఉంటుంది. సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. కెరీర్‌పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు.
Also read: Tulasi Pooja Benefits: తులసిని ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 రోజులు ముట్టుకోవద్దు..ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sun transit 2023: సూర్యుడి గోచారంతో అక్టోబర్ 18 నుంచి 5 రాశులపై కనకవర్షం