Sun Transit Effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. వృషభరాశి వారి లైఫ్ ఆనందమయం..!

Sun Transit Effect: జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీని ప్రభావం  వృషభరాశిపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 11:21 AM IST
  • జూలై 16న రాశిని మార్చబోతున్న సూర్యుడు
  • సూర్య సంచారం ఈ రాశివారికి లాభం
Sun Transit Effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. వృషభరాశి వారి లైఫ్ ఆనందమయం..!

Sun Transit Effect 2022: మరో వారం రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 16న సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలో (Sun Transit in Cancer 2022) ప్రవేశిస్తాడు. కర్కాటక రాశికి యజమాని చంద్రుడు. కర్క సంక్రాంతి వృషభరాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. వీరి లైఫ్ సూపర్ గా ఉంటుంది. మీకు కుటుంబంలో అపారమైన డబ్బు, ఆనందం వెల్లివిరుస్తుంది. 

సూర్య సంచారం వల్ల వ్యాపారవేత్తలు లాభ పడతారు.  వ్యాపారానికి సంబంధించిన ఇబ్బందులన్నీ  తొలగిపోతాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోరికలు ఫలిస్తాయి. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది.  మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారి ద్వారా మీకు డబ్బు అందుతుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ పొందుతారు. మీకు ఆఫీస్ లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. 

అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న వృషభరాశి వారు ఆ జబ్బుల నుండి బయటపడతారు. మీతో శత్రుత్వం పెట్టుకున్న వారు తప్పకుండా ఓడిపోతారు. అంతేకాకుండా వారు మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా కలిసివస్తాయి. ఈ సమయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. అంతేకాకుండా భారీ మెుత్తంలో డబ్బు అందుతుంది. 

Also Read: Sun Transit in July 2022: జూలై 16 నుండి ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News