Sun Transit in Gemini from Taurus on June 16 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కొన్ని రాశుల జీవితాలపై ఇవి ప్రభావం చూపిస్తుంటాయి. సూర్యుడి మిధున రాశి ప్రవేశం మేషం, మిధునం, సింహం, మకర రాశులపై ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం..
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా భావించే సూర్యుడు జూన్ 15వ తేదీన వృషభ రాశి నుంచి బయటికొచ్చి మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. జూన్ 16వ తేదీన సూర్యుడి గోచారం మిధున రాశిలో ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం కొన్ని జాతకాలకు శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు ప్రవేశిస్తున్న మిధునం వాస్తవానికి బుధుడి రాశి. అందుకే సూర్యుడి గోచారానికి మహత్యముంది. బుధుడు బుద్ధిని ప్రసాదించే గ్రహం. సూర్యుడి రాశి పరివర్తనం కారణంగా కొన్ని రాశులపై సానుకూలంగా ఉంటుంది. అధిక ప్రయోజనాలు కలగనున్నాయి.
మకర రాశి
సూర్యుడు బుధుడి రాశి మిధునంలో ప్రవేశిస్తుండటం వల్ల మకర రాశి జాతకులకు మంచి రోజులు ప్రారంభమైనట్టేనని అర్ధం చేసుకోవాలి. మీరు చేపట్టిన పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. అప్పుల నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు.
మేష రాశి
సూర్యుడి మిధున రాశి ప్రవేశం కారణంగా మేష రాశి జాతకులకు అంతా అద్బుతంగా ఉండనుంది. కొత్త కొత్త సవాళ్లు ఎదురైనా మీ సామర్ధ్యం కూడా బయటపడుతుంది. పనిచేసే చోట సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.
సింహ రాశి
సూర్యుడి రాశి పరివర్తనం కారణంగా సింహ రాశి జాతకులకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. జూన్ 16 నుంచి ఈ జాతకం వారికి అంతా అనుకూలంగా ఉండనుంది. విద్యార్ధులకు చాలా అనువైన సమయమిది. పోటీ పరీక్షల్లో విజయం సిద్ధిస్తుంది. ధనలాభం కచ్చితంగా ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతమౌతారు.
Also Read: Mercury Set 2023: త్వరలో వృషభరాశిలో బుధుడి అస్తమయం.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
మిధున రాశి
సూర్యుడి గోచారం కారణంగా మిధున రాశి జాతకులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఎక్కడికైనా యాత్రలు చేయవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారులకు అనువైన సమయం. పెద్దఎత్తున లాభాలు ఆర్జిస్తారు. ప్రతి రంగంలో లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతితో పాటు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
Also Read: Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook