Sun Transit: కన్య రాశి వారు ఈ 2 వారాలు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకో తెలుసా..?

Sun Transit 2022: తులా రాశిలోకి సూర్యుడు సంచారం చేయటం వల్ల కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావవం పడే చాన్స్‌ ఉంది. అంతేకాకుండా పలు రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఏ రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 10:08 AM IST
  • తులా రాశిలోకి సూర్యుడు సంచారం..
  • కన్య రాశి వారు ఈ 2 వారాలు జాగ్రత్తగా ఉండాలి
  • గ్రహ సంచారం వల్ల 12 రాశులపై విభిన్న ప్రభావాలు
Sun Transit: కన్య రాశి వారు ఈ 2 వారాలు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకో తెలుసా..?

Sun Transit 2022: అన్ని గ్రహాలు వివిధ రకాల రాశుల్లోకి సంచారం చేయడం వల్ల రాశి చక్రాల్లో మార్పులు వస్తాయి. అయితే సూర్యుడు ప్రస్తుతం ఒక రాసిన వదిలి ఇంకో రాశికి వెళ్లబోతున్నాడు. అయితే ఈ గ్రహ సంచారం వల్ల 12 రాశులపై విభిన్న ప్రభావాలు పడబోతున్నాయి. ప్రతినెలా ఒక గ్రహం లోకి సూర్యుడు సంచరిస్తాడు. అయితే ఈ అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం ఏ రాశులపై ఎక్కువగా ఉంటుందో ఆ రాశిల వారికి నష్టాలన్నా కలుగవచ్చు.. లాభాలు అన్నా రావచ్చు. అయితే ప్రస్తుతం ఈ సంచారం వల్ల ఏ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దుష్ప్రభావాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

ముఖ్యంగా ఈ సంచారం వల్ల కన్యా రాశి వారిపై అధికంగా ప్రభావం పడబోతుంది. వీరు మాట్లాడే క్రమంలో మాటలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులపై కోపంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కన్యా రాశి వారు ఈ నెలలో శారీరకంగా మానసికంగా దెబ్బతిని అవకాశాలున్నాయి. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే క్రమంలో తప్పకుండా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వినోదానికి అధిక ప్రధానత్యను ఇచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిపై కాకుండా పని కూడా సమాన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పని చేసిన తర్వాత మానసిక ఉల్లాసం కోరుకు ప్రశాంతంగా ఉండండి.

బ్యాంక్ బ్యాలెన్స్:
కన్య రాశి వారికి ఈ ప్రభావవం వల్ల బ్యాంకు బ్యాలెన్స్‌లో వివిధ రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలను కూడా పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబ పరంగా ఈ రాశివారికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. కాబట్టి అదనపు డబ్బు ఖర్చు చేయకుండా అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీరు ఈ క్రమంలో అవసరానికి అనుగుణంగా వస్తువులను కొనుగోలు చేయండి.

మారుతున్న వాతావరణం కారణంగా జాగ్రత్తగా ఉండండి:
మారుతున్న వాతావరణం కారణంగా జలుబు, జ్వరాలు రావొచ్చు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేయించిన వస్తువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.  వీరికి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అధికమవుతాయి.  ప్రయాణాలు చేసే క్రమంలో వాహన పత్రాలు, లైసెన్స్, హెల్మెట్ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Also Read : Karwa chauth 2022 : కర్వాచౌత్ స్పెషల్.. కొత్త జంటల సందడి.. కత్రినా-విక్కీ జోడి పిక్స్ వైరల్

Also Read : "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం: మంచు విష్ణు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News