Surya Gochar 2022: కన్యారాశిలోకి సూర్యుడు రాక... ఈ రాశులవారి లైఫ్ డేంజరే ఇక..!

Sun Transit 2022: గ్రహాల రాజు సూర్యభగవానుడు మరో ఐదు రోజుల్లో కన్యారాశిలో ప్రవేశించబోతున్నాడు. సూర్య సంచారం కొన్ని రాశులవారికి కష్టాలను తేనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 04:51 PM IST
Surya Gochar 2022: కన్యారాశిలోకి సూర్యుడు రాక... ఈ రాశులవారి లైఫ్ డేంజరే ఇక..!

Sun Transit 2022 Negative Impact: సూర్యదేవుడు త్వరలో కన్యారాశిలో (Sun Transit in Virgo 2022) సంచరించబోతున్నాడు. నెలరోజులపాటు అక్కడే ఉండనున్నాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఎవరి జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి పదవి, కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ఏ వ్యక్తి కుండలిలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. కాబట్టి సూర్య సంచారం ఏ రాశులవారికి ఇబ్బందులు కలిగిస్తాడో తెలుసుకుందాం. 

వృషభ రాశి (Taurus): సూర్యుని సంచారం కారణంగా ఈ రాశివారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీరు మానసికంగా కుంగిపోతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మెుత్తం మీద ఈ సమయం మీకు కష్టంగా ఉంటుంది.  

తుల రాశి (Libra): ఈ రాశి వ్యక్తులు సూర్యుని సంచార సమయంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో గొడవలు రావచ్చు, కాబట్టి సంయమనంతో వ్యవహారించండి. మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం  ఉంది. కాబట్టి హెల్త్ పై శ్రద్ధ తీసుకోండి.  

మకరరాశి(Capricorn): సూర్యుడి రాశి మార్పు మకరరాశివారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తీసుకురాబోతోంది. వీరు వ్యక్తిగతం ఇబ్బంది పడతారు. సమాజంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబంలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. 

కుంభ రాశి (Aquarius): ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు పెరుగుతాయి, తద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఈ సమయంలో ఇతరులతో వాదించడం మంచిది కాదు. దీని వల్ల అనేక సమస్యలు రావచ్చు. 

మీనం(Pisces): వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం కరెక్ట్ కాదు. మీరు పనిచేసే రంగంలో ఆశించిన ఫలితాలను పొందలేరు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. పార్టనర్ షిప్ తో వ్యాపారం చేసేవారి మధ్య విభేదాలు రావచ్చు. 

Also Read: Sun Tranit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News