Tirumala news: తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు మరోసారి ప్రారంభం కానున్నాయి. ధనుర్మాసం కారణంగా నిలిచిన ఈ సేవల్ని తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala tirupati devasthanam ) లో జనవరి 15 నుంచి సుప్రభాత సేవ ( Suprabhata seva ) లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభమవడంతో సుప్రభాత సేవల స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగుతోంది. ఈ నెల 14న ధనుర్మాసం పూర్తికానున్న నేపథ్యంలో.. 15వ తేదీ నుంచి తిరిగి శ్రీవారికి సుప్రభాతసేవ ( Srivari Suprabhata seva ) నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి. మరోవైపు ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ నిర్వహించనున్నట్టు టీటీడీ (TTD ) అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కామధేనుపూజ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.
మరోవైపు ప్రముఖ శ్రీశైల క్షేత్రం ( Srisailam temple ) లో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో మొదలైన ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవ క్రతువుల్ని నిర్వహించారు. అనంతరం యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన చేసి.. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
Also read: Kumbh Mela 2021: జనవరి 14న కుంభమేళా ప్రారంభం.. గంగానదీ స్నానాల ప్రాముఖ్యత తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook