Sri Rama Navami 2024: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 17 నుంచి 25 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏకశిలానగరం ముస్తాబైంది. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక వాహన సేవలు జరుగుతాయి.
Also Read: Sri Rama Navami 2024: రామయ్య కల్యాణానికి 'కోడ్' అడ్డంకి.. ప్రత్యక్ష ప్రసారానికి నిరాకరణ
ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం లేదు. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాల సమర్పణ సందిగ్ధంలో ఉంది. తెలంగాణలో భద్రాచలంలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణకు ఈసీ నిరాకరించింది. దీంతో ఏపీలో కూడా అదే జరుగుతుందని తెలుస్తోంది.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్స్ దుకాణాలు బంద్.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?
ఉత్సవాలపై ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడింది. అట్టహాసంగా జరిగే ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయం కావడంతో సాధారణ భక్తులతోపాటు ఆలయ అధికారులు మాత్రమే ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
బ్రహోత్సవాల్లో కార్యక్రమాలు ఇవే..
17-04-2024
ఉదయం: ధ్వజారోహణం (మిథున లగ్నం)
సాయంత్రం: శేష వాహన సేవ
18-04-2024
ఉదయం: వేణుగానాలంకారం
సాయంత్రం - హంస వాహనం
19-04-2024
ఉదయం: వటపత్రశాయి అలంకారం
సాయంత్రం: సింహ వాహనం
20-04-2024
ఉదయం: నవనీత కృష్ణాలంకారము
సాయంత్రం: హనుమత్సేవ
21-04-2024
ఉదయం: మోహినీ అలంకారం
సాయంత్రం: గరుడసేవ
22-04-2024
ఉదయం - శివధనుర్భంగాలంకారం
సాయంత్రం: కల్యాణోత్సవం
గజవాహన సేవ
23-04-2024
ఉదయం: రథోత్సవం
సాయంత్రం : ప్రత్యేక పూజా కార్యక్రమాలు
24-04-2024
ఉదయం : కాళీయమర్ధనాలంకారం
సాయంత్రం అశ్వవాహనం
25-04-2024
ఉదయం: చక్రస్నానం
సాయంత్రం: ధ్వజావరోహణం
26-04-2024
ఉదయం చక్రస్నానం
సాయంత్రం - ధ్వజావరోహణం
పుష్పయాగంతో ఉత్సవాలు ముగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter