Shukra Gochar 2023: అక్టోబర్ 2 నుంచి ఈ రాశులవారి అదృష్టం రెట్టింపు!

Shukra Rashi Parivartan 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 09:24 AM IST
Shukra Gochar 2023: అక్టోబర్ 2 నుంచి ఈ రాశులవారి అదృష్టం రెట్టింపు!

Shukra Rashi Parivartan 2023: ప్రతి ఒక్క గ్రహం 12 రాశులు సంచారం చేస్తుంది. కొన్ని గ్రహాలు ప్రతి నెల సంచారం చేస్తే మరికొన్ని గ్రహాలు మాత్రం 1 సంవత్సరం తర్వాత సంచారం చేస్తాయి. సంచారాలకు ఉన్న ప్రత్యేకతే జ్యోతిష్య శాస్త్రంలో తిరోగమనాలకు కూడా ఉంటుంది. ఒక గ్రహం తిరోగమనం చేస్తే దాని ప్రభావం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రగ్రహం త్వరలో సంచారం చేయబోతోంది. శుక్రగ్రహాన్ని శుభానికి, సంపద, ఆనందం, విలాసానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి మొత్తం 23 రోజుల పాటు టైమ్‌ పడుతుంది. అయితే అక్టోబర్ 2న శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ శుక్రుడి ప్రభావం ఏయే రాశివారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
తుల రాశి:

తులారాశిని శుక్ర గ్రహం పాలిస్తుంది. కాబట్టి ఈ సంచారం కారణంగా తులరాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి పనులైనా శ్రద్ధతో చేయడం వల్ల ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. ఇక వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది. 

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ప్రశాంతంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ రాశివారు శుక్రుడి సంచార ప్రభావంతో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పురోగతి లభిస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వివాహాల కోసం ఎదురు చూస్తున్నవారికి ప్రతిపాదనలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు భూమి లేదా భవనాలు, వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో దీర్ఘకాలిక లాభాలు కూడా పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తాలు వింటారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో పొందాలనుకున్న ఆదాయం కూడా సులభంగా పొందుతారు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News