Shukra Gochar 2023: శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు, ఇక వీరికి లాభాలే లాభాలు!

Shukra Gochar 2023: శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలపుతున్నారు. సంచారం కారణంగా పలు రాశులవారు ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 24, 2023, 01:00 PM IST
 Shukra Gochar 2023: శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు, ఇక వీరికి లాభాలే లాభాలు!

Shukra Gochar 2023: ఈ నెలలో చాలా గ్రహాలు రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే మే 30న శుక్ర గ్రహం కర్కాటక రాశిలో సంచారం చేయబోతోంది. ఈ సంచారం సాయంత్రం 07.39 గంటలకు జరుగబోతోంది. ఈ సంచార ప్రభావం పలు రాశులవారిపై తీవ్రంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ జరగబోయే సంచారం వల్ల కొన్ని రాశికి శుక్రుడు శుభ స్థానంలో ఉంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల స్థానంలో ఉండబోతున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ సంచారం వల్ల చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంచార ప్రభావం ఏయే రాశులవారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై శుక్రుడి ప్రభావం:
మేష రాశి:

మేష రాశి వారికి శుక్రుడు సంచారం చేయడం లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడడమే కాకుండా కుటుంబ సౌఖ్యాలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పనిలో కూడా పురోగతి ఉంటుంది. ఈ సమయం వివాహితులకు శుభ ప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఈ క్రమంలో వివిధ చోట్ల నుంచి డబ్బును పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారి సులభంగా ప్రమోషన్స్‌ లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం సమయం ముగిసే దాకా తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

కర్కాటక రాశి:
శుక్ర గ్రహ సంచారం కర్కాటక రాశి వారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సంచారం కారణంగా ప్రవర్తనలో సానుకూల మార్పు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ క్రమంలో రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్ర గ్రహ సంచారం వల్ల దైర్యం పెరిగి శత్రువులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో పని చేసేవారికి సీనియర్ అధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు కూడా పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఉన్న విద్య కోసం ఈ రాశివారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా మారి ఆనందంగా ఉంటారు. వీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విద్యార్థులకు ఈ క్రమంలో చాలా బాగుంటుంది. వీరికి కళారంగంపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి దీనిపై దృష్టి పెట్టడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారికి శుక్ర గ్రహం కర్కాటక రాశిలో ఉన్నంత కాలం ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందుతారు. 

మీన రాశి:
శుక్రుని సంచారం వల్ల మీన రాశి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే సులభంగా తీరుతాయి. విద్యార్థులకు మాత్ర ఈ సమయం భారంగా ఉంటుంది. ఈ క్రమంలో వీరు కొత్త ఆస్తులను కొనుగోలు చేసి, మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనవ లభిస్తుంది. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News