Shani Jayanti 2022: శని జయంతి రోజు తప్పక పాటించాల్సిన 9 నియమాలు... పాటించకపోతే జీవితం కష్టాలమయం..

Must Follow These Rules on Shani Jayanti: శని జయంతి రోజున ఈ 9 నియమాలు తప్పక పాటించాలి. ఎవరైతే ఈ 9 నియమాలు పాటిస్తారో వారిపై శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. పాటించనివారిని శని బాధలు పట్టిపీడిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 05:24 PM IST
  • శని జయంతి రోజు పాటించాల్సిన నియమాలు
  • పాటించని పక్షంలో ఈ బాధలు తప్పవు
  • ఆ నియమాలేంటో ఇక్కడ తెలుసుకోండి
Shani Jayanti 2022: శని జయంతి రోజు తప్పక పాటించాల్సిన 9 నియమాలు... పాటించకపోతే జీవితం కష్టాలమయం..

Must Follow These Rules on Shani Jayanti: శని దేవుడిని న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. శని అంటే కీడు మాత్రమే కాదు... శని అనుగ్రహంతో సకల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. తన తండ్రి అయిన సూర్య భగవానుడి అనుగ్రహంతో వ్యక్తుల కర్మానుసారం ఫలాలనిచ్చే వరాన్ని శని దేవుడు పొందాడు. ఈసారి శని జయంతి మే 30న రాబోతున్నది. జ్యేష్ఠ అమావాస్య నాడు వచ్చే ఈ శని జయంతి రోజున శని అనుగ్రహం పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. శని అనుగ్రహం పొందాలంటే.. ముందు శని దేవుడు ఆగ్రహించే పనులకు దూరంగా ఉండాలి. శని జయంతి రోజున 9 నియమాలను తప్పనిసరిగా పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పాటించని పక్షంలో శని బాధలు తప్పవు. అంటే ఆ వ్యక్తి జీవితం కష్టాలమయం అవుతుంది.

శని జయంతి నాడు పాటించాల్సిన నియమాలు.. చేయకూడని పనులు:

1. అన్నింటిలో మొదటిది.. సత్ప్రవర్తనతో ఉండాలి. మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలి. కఠినత్వంతో కూడిన మాటలు, మనసు నొప్పించే ప్రవర్తన, మూర్ఖపు ఆవేశానికి దూరంగా ఉండాలి.

2. మీ ఇంట్లో పనిమనుషులు ఉన్నట్లయితే... వారితోనూ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. వారిని చిన్నచూపు చూడటం, అవమానించడం, అనుచితంగా ప్రవర్తించడం చేయవద్దు.

3. తప్పుడు సహవాసాలకు దూరంగా ఉండండి. జూదం, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.

4. కుష్టు వ్యాధి గ్రస్తులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు, ఆపదలో ఉన్నవారు మీ సాయం కోరితే కాదనకండి. తోచిన సాయం చేసేందుకు ప్రయత్నించండి.

5. ఇంట్లో కుటుంబ పెద్దలను అవమానించకండి. వారిని తీసిపారేసినట్లు మాట్లాడకండి. సదా వారి ఆశీస్సులు అవసరమని గుర్తించండి.

6. శనివారం, శని అమావాస్య లేదా శని జయంతి నాడు గడ్డం, వెంట్రుకలు లేదా గోర్లు కత్తిరించవద్దు. ఆరోజు ఇది పూర్తిగా నిషిద్ధం.

7. మూగ జీవాల పట్ల హింస పనికిరాదు. వాటిని కొట్టవద్దు. వీలైతే పశుపక్షాదులకు మేత, నీళ్లు అందిస్తే పుణ్యం లభిస్తుంది.

8. వ్యభిచారం, దొంగతనం, దురాశ, మోసం మొదలైనవాటికి దూరంగా ఉండాలి.

9. మీ ఇంటికి వచ్చిన వ్యక్తి ఆకలి లేదా దాహంతో వెళ్లవద్దు. వారి కడుపు నింపడం మీ బాధ్యత. అతిథులు ఇంటి నుంచి ఆకలితో వెళ్తే అది అరిష్టమని గుర్తుంచుకోండి.

శని జయంతి రోజు ఈ 9 నియమాలు పాటించేవారిపై శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. పాటించనివారి జీవితంలో కష్టాలు, ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, ఊహలపై ఆధారపడి ఉండొచ్చు. జీ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)

Also Read: Yama Raj Death Signals: మృత్యు గడియలు సమీపించే ముందు కనిపించే 4 సంకేతాలివే...  

Also Read: Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News