Shani Dev: శష్ మహాపురుష రాజయోగం ఈ 3 రాశుల వారికి ప్రత్యేకం.. ఇందులో మీరాశి ఉందా?

Saturn transit 2023: కుంభరాశిలో శనిదేవుడు సంచరించడం వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 10, 2023, 12:50 PM IST
Shani Dev: శష్ మహాపురుష రాజయోగం ఈ 3 రాశుల వారికి ప్రత్యేకం.. ఇందులో మీరాశి ఉందా?

Shash Mahapurush Yog 2023 benefits: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా శష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుడు కుంభం, తులారాశి, మకరరాశిలో ఉన్నప్పుడు శష మహాపురుష యోగం రూపొందుతుంది. శని మహాపురుష రాజయోగం ఏర్పడటం వల్ల ఏ రాశుల వారు లాభం పొందుతారో తెలుసుకుందాం. 

వృషభం
శష మహాపురుష రాజయోగం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. మీ జీవనశైలిలో మార్పులు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శని అనుగ్రహంతో పదవి లభించడంతోపాటు కీర్తిప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు పాత మిత్రులను కలుస్తారు. 

మేషం
శష్ మహాపురుష రాజయోగం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శనిదేవుడు ఆశీస్సులు ఈరాశి వారిపై రెండున్నరేళ్లపాటు ఉంటాయి. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. 

Also Read: Shani Chandra Yuti 2023: మరో మూడు రోజుల్లో వీరి జీవితం తలక్రిందులు కానుంది.. మీరున్నారా?

కుంభ రాశి
కుంభ రాశి వారికి రెండున్నరేళ్ల పాటు శష మహాపురుష రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. మీపై శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

కన్య
శశమహాపురుష రాజయోగం వల్ల కన్యారాశి వారికి ధైర్యసాహసాలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ శత్రువులు ఓడిపోతారు. మీరు ఉన్నత అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 

Also Read:  Budh Margi 2023: బుధుడి ప్రత్యక్ష కదలికతో ఈ రాశులకు ఊహించని అదృష్టం, ఐశ్వర్యం.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News