Shani Dev Asta 2023: న్యాయదేవుడైన శనిదేవుడు జనవరి 17న తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈనెల 31న శనిదేవుడు మళ్లీ అదే రాశిలో అస్తమించనున్నాడు. మళ్లీ మార్చి 5న అతడు ఉదయిస్తాడు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని వక్ర దృష్టి ధనవంతుడిని కూడా దరిద్రుడిగా మార్చేస్తుంది. శని సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
శని అస్తమయం ఈ రాశులకు వరం
మిథునం: ఈ రాశి వారికి శని సంచారం శుభప్రదంగా ఉంటుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. కెరీర్లో కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. ఈ రాశివారికి ఆధ్యాత్మక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కన్య: కన్యారాశి వారికి శని స్థానం లాభిస్తుంది. ఈ రాశి యెుక్క ఆరవ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా వీరికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ విముక్తి నుండి బయటపడతారు.
మకరం: మకరరాశి యెుక్క రెండో ఇంట్లోకి శని ప్రవేశిస్తోంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మీనం : ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో శని అస్తమించబోతున్నాడు. దీంతో మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అనేక సమస్యల నుండి బయటపడతారు. మతపరమైన యాత్ర చేసే అవకాశం ఉంది.
Also Read: Shani- Shukra Gochar: కుంభరాశిలో మిత్ర గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Shani Dev: మరో 5 రోజుల్లో అస్తమించనున్న శనిదేవుడు.. ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..!