Shani Amavasya 2022: శనిశ్చరి అమావాస్య ఎప్పుడు? శని సడే సతి, ధైయా నుండి బయటపడాలంటే ఏం చేయాలి?

Shani Amavasya 2022:  ఈ సారి అమావాస్య భాద్రపద మాసంలోని శనివారం రోజున రానుంది. దీనినే శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అంటారు. దీని యెుక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 04:17 PM IST
Shani Amavasya 2022:  శనిశ్చరి అమావాస్య ఎప్పుడు? శని సడే సతి, ధైయా నుండి బయటపడాలంటే ఏం చేయాలి?

Shani Amavasya 2022: ఈ సారి అమావాస్య భాద్రపద మాసంలోని శనివారం రోజున వస్తుంది. దీనినే శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున స్నానం, దానం చేయడం వల్ల మీకు పాపాల నుండి విముక్తి లభిస్తుంది. శనిశ్చరి అమావాస్య (Shani Amavasya 2022) రోజున స్నానం దానం చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు. అంతేకాకుండా ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సాడే సతి, ధైయా మరియు శని దోషాల నుండి విముక్తి పొందవచ్చు. శనిశ్చరి అమావాస్య తేదీ మరియు పరిహారాల గురించి తెలుసుకుందాం. 

శనిశ్చరి అమావాస్య తేదీ 2022
భాద్రపద అమావాస్య తిథి ప్రారంభం: ఆగస్టు 26, శుక్రవారం, మధ్యాహ్నం 12.23 నుండి
భాద్రపద అమావాస్య ముగింపు: ఆగస్టు 27, శనివారం, మధ్యాహ్నం 01:46 గంటలకు
ఉదయతిథి ఆధారంగా శనిశ్చరి అమావాస్య ఆగస్టు 27వ తేదీన జరుపుకుంటారు. ఈ శనిశ్చరి అమావాస్య రోజున శివయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రోజు ఉదయం నుండి ఆగష్టు 28 తెల్లవారుజామున 02:07 వరకు ఈ యోగం ఉంటుంది.

శనిశ్చరి అమావాస్య పరిహారాలు
1. శనిశ్చరి అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి శని దేవుడిని పూజించాలి. అనంతరం ఆ దేవుడికి ఆవనూనెతో అభిషేకం చేయండి. తర్వాత వారికి నల్ల నువ్వులు, ధూపం, దీపం, వాసన మొదలైన వాటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి సంతోషించి మీ కష్టాలన్నీ తొలగిస్తాడు
2. మీరు సడే సతి, ధైయా మరియు శని దోషాలతో బాధపడుతున్నట్లయితే.. శనిశ్చరి అమావాస్య నాడు పూజ సమయంలో శని రక్షా స్తోత్రాన్ని పఠించండి. దీనిని అయోధ్య రాజు దశరథుడు రచించాడు. శనిదేవుడు ఈ పారాయణానికి సంతసించి భక్తులను రక్షిస్తాడు.
3. శనిశ్చరి అమావాస్య రోజున శని ఆలయంలో శని చాలీసా పఠించడం వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి. 
4. శని ఆలయానికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఆ తర్వాత నల్ల ఉసిరి, ఇనుము, స్టీలు పాత్రలు పేద ప్రజలకు దానం చేయండి. దీంతో మీకు శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే సాడేసతి మరియు ధైయా యొక్క కష్టాలు తొలగిపోతాయి. 
5. శని అమావాస్య నాడు శని దేవుడిని పూజించిన తరువాత నల్ల కాకికి ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారు. తద్వారా మీ కష్టాలు తగ్గుతాయి
6. శని అమావాస్య నాడు రావిచెట్టుకు నీరు పోసి దాని కింది ఆవాల నూనె దీపం పెట్టండి. ఇది లాభదాయకం. 

Also Read: Budh Pradosh Vratam 2022: బుధ ప్రదోష వ్రతం ఎప్పుడు? దీని యెుక్క ప్రాముఖ్యత ఏంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News