Shani Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని క్రూరమైన గ్రహంగా భావిస్తారు. శని భగవానుడు ప్రజలకు వారి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. అందుకే శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తి అని కూడా అంటారు. శనిదేవుడు 30 సంవత్సరాల తర్వాత అంటే జనవరి 17, 2023న తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి (Saturn transit in Aquarius 2023) ప్రవేశించనున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల కొందరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మకరరాశి (Capricorn): కుంభరాశిలో శని దేవుడి సంచారం వల్ల మకరరాశి వారిపై శని సడేసతి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా మీరు వృత్తి, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
మీనరాశి (Pisces): శని దేవుడి రాశి మారడం వల్ల ఈ రాశి వారిపై కూడా శని సడేసతి ప్రారంభం అవుతుంది. మీరు కెరీర్ లో అడ్డంకులు ఎదురువుతాయి. వ్యాపారంలో భారీగా నష్టాలను చవిచూస్తారు. పని ప్రదేశంలో మీకు పని ప్రదేశంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
కుంభ రాశి (Aquarius): కుంభ రాశివారి పై కూడా శని సడే సతి కూడా ప్రారంభమవుతుంది. దీంతో మీ పనులన్నీ చెడిపోతాయి. ఉద్యోగస్థులకు ఈ సమయం కలిసి రాదు. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ధన నష్టం వాటిల్లుతుంది. మీరుఅనుకున్న పనులను పూర్తి చేయడంలో విఫలమవుతారు.
శనివారం ఈ పరిహారం చేయండి
శని దేవుడి యొక్క ఈ సంచారం వల్ల ఈ కర్కాటక మరియు వృశ్చిక రాశివారిపై శని ధైయా ప్రారంభమవుతుంది. శని సడేసతి మరియు ధైయా నుండి ఉపశమనం పొందడానికి శనివారం నాడు శని దేవుడిని ఆరాధించండి. శనివారం మీరు హనుమంతుడిని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. శనివారం సుందరకాండను పఠించండి.
Also Read: Jupiter Planet: త్వరలో యవ్వన దశలోకి బృహస్పతి... ఈ 4 రాశులకు డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.