Shani Dev: త్వరలో ఉదయించబోతున్న శనిదేవుడు... ఈ రాశులకు కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్...

Shani Uday 2023: ప్రస్తుతం శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో అస్తమించాడు. త్వరలో మళ్లీ ఉదయించబోతున్నాడు. శని ఉదయం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 09:14 AM IST
Shani Dev: త్వరలో ఉదయించబోతున్న శనిదేవుడు... ఈ రాశులకు కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్...

Shani Uday 2023: వేద జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శనిదేవుడు మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇస్తాడు. 30 ఏళ్ల తర్వాత జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అనంతరం జనవరి 30న అదే రాశిలో అస్తమించాడు. మళ్లీ శనిదేవుడు మార్చి 05న ఉదయించనున్నాడు.శని ఉదయించిన వెంటనే కొన్ని రాశుల వారి అదృష్టం తెరుచుకుంటుంది. వీరు కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. శని ఉదయించడం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

శని ఉదయించడం ఈ రాశులకు శుభప్రదం
వృషభ రాశి: ఈ రాశి వారికి శని ఉదయించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా బిజినెస్ మెుదలుపెట్టేవారికి ఇదే మంచి సమయం. 
సింహ రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని ఉదయించడం వల్ల సింహ రాశి వారు జీవితంలో అపారమైన సంపదను పొందే అవకాశం ఉంది. వ్యాపారుల భారీగా లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. 
తుల రాశి: ఈరాశి వారికి శని ఉదయించడం శుభప్రదం. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీకు ధనం లాభదాయకంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
కుంభ రాశి: ఈరాశిలోనే శని ఉదయం జరగబోతుంది. దీని ప్రభావం కుంభరాశి వారిపై గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి.  సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Also Read: Budhadithya Yoga: కుంభ రాశిలో అరుదైన యోగం.. ఈరాశుల జీవితం అద్భుతం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News