Sabarimala: ఇవాళ్టి నుంచి తెర్చుకోనున్న శబరిమల ఆలయం, తిరిగి ఎప్పుడంటే

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2021, 06:57 AM IST
  • ఇవాళ్టి నుంచి తెర్చుకోనున్న శబరిమల ఆలయం
  • భక్తుల ఆరోగ్య సంరక్షణకై ప్రత్యేక ఏర్పాట్లు చేసిన కేరళ ప్రభుత్వం
  • డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 29 వరకూ తిరిగి మూసివేత
Sabarimala: ఇవాళ్టి నుంచి తెర్చుకోనున్న శబరిమల ఆలయం, తిరిగి ఎప్పుడంటే

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

మకర సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం(Kerala government)కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి అంటే నవంబర్ 15 నుంచి శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. మరోవైపు కోవిడ్ సంక్రమణను నివారించేందుకు యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో శబరిమల స్పాట్ బుకింగ్ కౌంటర్ నిలిపివేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan)నేతృత్వాన జరిగిన జిల్లా కలెక్టర్ల  ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రెండు నెలలపాటు కొనసాగే మకర సంక్రాంతి కోసం శబరిమల ఆలయం(Sabarimala Temple)ఇవాళ్టి నుంచి డిసెబంర్ 26 వరకూ తెరిచే ఉంటుంది. తిరిగి డిసెంబర్ 30న తెరిచి..జనవరి 20 వరకూ తెరిచి ఉంటుంది. అక్టోబర్ నెలలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అన్ని రకాల ఆరోగ్య సేవల్ని కొనసాగిస్తారు. మధ్యలో నాలుగు రోజుల పాటు ఆలయాన్ని మూసివేయనున్నారు. యాత్రికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. ఆలయానికి వెళ్లే సమయంలో యాత్రికులకు గుండెపోటు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి వంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, వెంటనే సమీపంలోని కేంద్రంలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మందులు, భద్రతా పరికరాలు అందిస్తున్నారు. సన్నిధానంలో అత్యవసర ఆపరేషన్ థియేటర్, పంప, సన్నిధానంలో వెంటిలేటర్లనుఏర్పాటు చేశారు. 

Also read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News