Raksha Bandhan 2022 Date: ఇవాళ అంటే 11 ఆగస్టు 2022, గురువారం రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రేపు (Raksha Bandhan 2022) అంటే 12 ఆగస్టు, 2022 శుక్రవారం రాఖీ పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున తమ సోదరుడి దీర్ఘాయువుతో ఉండాలని అతడి చేతికి రాఖీ కడతారు సోదరీమణులు. తమ ప్రియమైన సోదరుడికి రాఖీ కట్టడానికి సోదరీమణులు మార్కెట్ కు వెళ్లి అందమైన రాఖీ కోసం వెతుకుతారు. అయితే సోదరుడికి ఎలాంటి రాఖీ కట్టకూడదో తెలుసుకుందాం.
అలాంటి రాఖీ అశుభం
>> అందమైన, ఫ్యాన్సీ డిజైన్ మధ్యలో అశుభ సంకేతాలు ఉన్న రాఖీని ఎప్పుడూ కొనకండి. దీనిని కట్టడం వల్ల మీ సోదరుడి జీవితంలో సంక్షోభం తలెత్తుతుంది.
>> చినిగిన రాఖీ సోదరుడికి ఎప్పుడూ కట్టవద్దు. అలా చేయడం కష్టాలను ఆహ్వానించడమే.
>> దేవుళ్ల చిత్రాలతో ఉన్న రాఖీని ఎప్పుడూ కట్టవద్దు. ఎందుకంటే అది కట్టడం వారిని అవమానించడమే లెక్క.
>> రక్షాబంధన్ రోజున నలుపు రంగు బట్టలు గానీ, నలుపు రంగు రాఖీలు గానీ కట్టకూడదు. ఇలా చేయడం వల్ల అతడి జీవితంలో చెడు ఫలితాలు వస్తాయి.
>> ఈ రోజుల్లో ప్లాస్టిక్ రాఖీలు ఎప్పుడూ కట్టకండి. ప్లాస్టిక్ పాపపు గ్రహం కేతువుకు సంబంధించినది. అలాంటి రాఖీని సోదరుడికి కట్టడం ద్వారా... అతను సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు.
>> సోదరుడికి ఎప్పుడూ పట్టు దారంతో చేసిన రాఖీ కట్టాలి. అలాంటి రాఖీ శుభప్రదం మరియు సోదరుని జీవితంలో సంతోషాన్ని మరియు శ్రేయస్సును తెస్తుంది.
Also Read: Rakhi and Zodiac Signs: రాశిని బట్టి రాఖీ రంగు.. మీ సోదరుడి రాశిని బట్టే ఏ రంగు రాఖీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook