Vinayaka Chaturthi 2023: ఫాల్గుణ వినాయక చతుర్థి ఎప్పుడు వచ్చింది? దీని యెుక్క ప్రాముఖ్యత ఏంటి?

Vinayaka Chaturthi 2023: హిందూమతంలో చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈసారి ఫాల్గుణ వినాయక చతుర్థి ఎప్పుడు వచ్చింది, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత మరియు పరిహారాలు గురించి తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 04:34 PM IST
Vinayaka Chaturthi 2023: ఫాల్గుణ వినాయక చతుర్థి ఎప్పుడు వచ్చింది? దీని యెుక్క  ప్రాముఖ్యత ఏంటి?

Vinayaka Chaturthi Vrat 2023 February: పంచాంగం ప్రకారం, ప్రతి నెల శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయక చతుర్థి వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. ఈరోజున గణపతిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి.. మీరు కోరికలు నెరవేరుతాయి. ఈసారి ఫాల్గుణ వినాయక చతుర్థి వ్రతాన్ని ఫిబ్రవరి 23న వచ్చింది. అంతేకాకుండా ఈ రోజున అరుదైన 4 శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో చతుర్థి యెుక్క  ప్రాముఖ్యత మరింత పెరిగింది. వినాయక చతుర్థి శుభసమయం, ప్రాముఖ్యత మరియు పరిహారాలు గురించి తెలుసుకోండి. 

వినాయక చతుర్థి తిథి
పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి ఫిబ్రవరి 23 తెల్లవారుజామున 03.23 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 24 శుక్రవారం తెల్లవారుజామున 01.32 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, వినాయక చతుర్థి వ్రతాన్ని ఫిబ్రవరి 23, గురువారం నాడు జరుపుకుంటారు. 
వినాయక చతుర్థి శుభ ముహూర్తం
ఫిబ్రవరి 23న వినాయక చతుర్థి పూజకు అనుకూలమైన సమయం ఉదయం 11.25 నుండి 01.43 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు గణేశుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. 
4 శుభ యోగాలు
ఈ రోజున 4 అరుదైనయోగాలు ఏర్పడుతున్నాయి. శుభయోగం ఉదయాన్నే మెుదలై.. రాత్రి 08:57 వరకు ఉంటుంది. తర్వాత శుక్ల యోగం ప్రారంభమై.. మరుసటి రోజు సాయంత్రం వరకు జరుగుతుంది. వీటితోపాటు గణేష్ చతుర్థి నాడు రవియోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం కూడా రూపొందుతోంది.

ఈ చర్యలు చేయండి
1. ఫాల్గుణ వినాయక చతుర్థి నాడు గణేశుడికి సింధూరం పెట్టండి.  అనంతరం ′′ సింధూరం శోభనం రక్తం సౌభాగ్యం సుఖవర్ధనం. ఛన్త్ శుభదం కమ్దం చైవ్ సిన్దూరం ప్రతిగృహ్యతామ్'' అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు.
2. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రమైన బట్టలు ధరించండి. అనంతరం శుభ సమయంలో గణేశుడిని పూజించండి మరియు సాయంత్రం సంకట్నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల అన్ని పనుల్లో విజయం సాధించవచ్చు. అలాగే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
3. ఈ రోజున గణేశుడికి 21 లడ్డూలను సమర్పించి పేద పిల్లలకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల వినాయకుని అనుగ్రహం మీకు లభిస్తుంది. దీంతో పాటు బుధుని కటాక్షం కూడా మీకు ఉంటుంది. 

Also Read: Shani Dev: మార్చి 5 నుంచి ఈరాశులకు శనిదేవుడు కష్టాలను పెంచనున్నాడు... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News