Nagula Chavithi 2023: నాగుల చవితి రోజు చేయకూడని పనులు ఇవే.. ఈ పనులు చేస్తే జీవితాంతం బాధపడతారు!

Nagula Chavithi 2023: ప్రతి సంవత్సరం హిందువులంతా నాగుల చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పూజలో భాగంగా కొంతమంది భక్తులు చేయకూడని పనులు చేస్తున్నారు. వీటిని చేయడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే ఈరోజు ఏ పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2023, 08:46 PM IST
Nagula Chavithi 2023: నాగుల చవితి రోజు చేయకూడని పనులు ఇవే.. ఈ పనులు చేస్తే జీవితాంతం బాధపడతారు!

Nagula Chavithi 2023: హిందూ సాంప్రదాయంలో పురాణాల నుంచి నాగుల పంచమి కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పంచమి రోజు మహిళలంతా భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు. అంతేకాకుండా కొంతమంది ఈరోజు ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల నాగదోషం నుంచి ఉపశమనం లభించడమే.. కాకుండా జీవితంలో అన్ని రకాల సమస్యలు సులభంగా దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఈ నాగుల పంచమి రోజున కొంతమంది భక్తితో నోములు కూడా ఆచరిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో వారి భక్తిని చాటుకుంటారు.

అయితే నాగుల పంచమి రోజున కొంతమంది భక్తులు పూజలో భాగంగా చేయకూడని పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే నాగుల చవితి రోజు ఎలాంటి పనులు చేయకూడదో, ఏయే సమయాల్లో నాగదేవతను పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నాగుల చవితి ఎప్పుడంటే?
ప్రతి సంవత్సరం నాగుల పంచమిని శ్రావణమాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగుల చవితి ఆగస్టు 22వ తేదీన వస్తోంది. ఈరోజు స్త్రీలు ఉపవాసాలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో శివపార్వతులతోపాటు నాగదేవతను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో నుంచి ప్రతికూల శక్తి తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

నాగుల పంచమి రోజున చేయకూడని పనులు ఇవే:
ఇతరులను దూషించడం:

నాగుల పంచమి రోజున నాగదేవతను పూజించే క్రమంలో చాలామంది కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. ఇందులో మొదటిది ఇతరులను దూషించడం.. అయితే నాగుల పంచమి రోజున మీకంటే తక్కువ వారిని దూషించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు ఎవరితో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు.

పదునైన వస్తువులకు దూరంగా ఉండండి:
నాగుల పంచమి రోజున పదునైన వస్తువులకు దూరంగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సూది కొడవలి వంటి వస్తువులను ఈరోజు ముట్టుకోకపోవడం చాలా మంచిదట. ఒకవేళ ఈరోజు కావాలని ముట్టుకుంటే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇనుప అసలు వినియోగించవద్దు:
ఈరోజు ఇనుముతో తయారుచేసిన పాత్రలను వినియోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తెలిసి తెలియక వినియోగించే వారికి ఎలాంటి నష్టాలు జరగకపోయినా.. తెలిసిన వారు వినియోగించడం వల్ల అనేక రకాల సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రలను వినియోగించడం వల్ల భవిష్యత్తులో అదృష్టం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News