Budh Asta in Mesham 2023: ఏప్రిల్ 23న మేష రాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు మెుదలు!

Mercury Set 2023: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఈనెల 23న గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో సమస్యలను ఎదుర్కోంటారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 06:50 PM IST
Budh Asta in Mesham 2023: ఏప్రిల్ 23న మేష రాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు మెుదలు!

Mercury will Set in Aries on 23rd April 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మెుత్తం తొమ్మిది గ్రహాల్లో బుధుడు ఒకడు. ఇతడిని మేధస్సు, తర్కం మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. రీసెంట్ గా బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. మేషరాశి యెుక్క మూడవ మరియు ఆరో ఇంటికి అధిపతిగా బుధుడిని భావిస్తారు. మెర్క్యూరీ ఏప్రిల్ 23న మేష రాశిలో అస్తమించనుంది. బుధుడి యెుక్క సెట్ కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాలను చూపనుంది. దీని ఎఫెక్ట్ పడినవారు భారీగా డబ్బు నష్టపోవడం, వ్యాపారంలో లాభాలు లేకపోవడం మరియు అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. మెర్క్యురీ అస్తమయం కారణంగా ఏయే రాశులవారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం. 

బుధుడి అస్తమయం ఈ రాశులకు నష్టం 
కర్కాటక రాశి
మెర్క్యురీ తిరోగమన సమయంలో కర్కాటక రాశి వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతాయి. అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయలేరు. జాబ్ కోల్పోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాస్ చేత తిట్టులు తింటారు. కెరీర్ లో ఆటంకాలు ఏర్పడతాయి. 

మేషరాశి
ఏప్రిల్ 23న బుధుడు మేషరాశిలో అస్తమించనున్నాడు. దీని కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమయంలో మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం మంచిది. జంక్ పుడ్ కు దూరంగా ఉండండి. జాబ్ చేసే చోట మీకు శత్రువులు పెరుగుతారు. 

Also Read: సూర్య మహాదశ ఎఫెక్ట్.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు...లాభాలే లాభాలు..

కన్యా రాశి 
బుధుడి సెట్ కారణంగా మీరు పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. దీని కోసం మీరు చాలా శ్రమించాల్సి ఉంటుంది. మీ అదృష్టం అస్సలు కలిసిరాదు. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. మీ ఖర్చులు పెరుగుతాయి. 

ధనుస్సు రాశి
బుధుడి అస్తమయం వల్ల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోంటారు. వీరికి భారీగా నష్టాలు వస్తాయి. మీక ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మీకు కాలం కలిసి రాదు. 

Also Read: Surya Mahadasha effect: సూర్య మహాదశ ఎఫెక్ట్.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు...లాభాలే లాభాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News