Mercury transit 2023: బుధు గోచారం ప్రభావం, ఈ 5 రాశులకు ఊహించని సంపద

Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడినా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2023, 09:20 AM IST
Mercury transit 2023: బుధు గోచారం ప్రభావం, ఈ 5 రాశులకు ఊహించని సంపద

Mercury transit 2023: హైందవ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అదే విధంగా బుధ గ్రహాన్ని రాజకుమారుడిగా పిలుస్తారు. జూన్ 7వ తేదీన బుధుడు మేషరాశిలో ప్రవేశించనుండటంతో ఆ 5 రాశుల వ్యక్తులకు ఊహించని ధన సంపద, ఉద్యగాలు, పదోన్నతి లభిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బుధ గ్రహాన్ని హిందూ విశ్వాసాల ప్రకారం బుద్ది, తర్కం, చర్చకు కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం మేషరాశిలో ఉన్న అలాంటి బుధ గ్రహం జూన్ 7వ తేదీన వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. బుధగ్రహం వృషభంలో ప్రవేశించే ముందు 5 రాశుల కెరీర్ అద్భుతంగా ఉంటుంది. పెద్దఎత్తున కనకవర్షం కురుస్తుంది. ప్రస్తుతం మేష రాశిలో వక్రమార్గంలో ఉన్న బుధుడు త్వరలో రాశి మారనుండటంతో ఊహించని ఫలితాలు కలుగుతున్నాయి. జూన్ 7వ తేదీన బుధుడు వృషభ రాశిలో మారేందుకు ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా ఐదు రాశులవారికి ఉద్యోగాలు, పదోన్నతులు లభిస్తాయి. ఫలితంగా రానున్న 15 రోజుల వరకూ కెరీర్‌లో ఉన్నత శిఖరాన్ని చేరుకుంటారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి జాతకులకు జూన్ 7 వరకూ ఉన్న సమయం వ్యక్తిగత, వృత్తిపర జీవితం, ఆర్ధిక వ్యవహారాల్లో శభప్రదంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విజయం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సమస్యలు రావచ్చు

కుంభ రాశి

కుంభ రాశి జాతకులకు బుధుడు కొత్త అవకాశాన్నిస్తాడు. మరోవైపు ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు అందుతాయి. ప్రయాణాలు చేయవచ్చు. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ఇది మీ జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 

మిథున రాశి

మిథున రాశి జాతకులకు జూన్ 7 వరకూ  ఊహించని అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వృత్తిపరంగా పెద్దఎత్తున అభివద్ధి ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఎప్పట్నించో ఉన్న కోర్కెలు పూర్తవుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు బుధుడి గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావంతో లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారవచ్చు. పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇక వ్యాపారులైతే తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. 

సింహ రాశి

బుధుడి గ్రహ గోచారం ప్రభావంతో సింహ రాశి వారికి కలలో కూడా ఊహించని డబ్బులు అందుతాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడంతో ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. 

Also read: Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించి, వీటిని దానం చేస్తే జీవితంలో పాపాలు తొలగిపోతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News