Mercury Transit in Aquarius 2023: హిందూమతంలో గ్రహాల రాశి పరివర్తనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వివిధ గ్రహాలు నియమిత రూపంలో గోచారం చేస్తుంటాయి. ఈ గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై వేర్వేరు రకాలుగా ఉంటుందని నమ్మకం. గ్రహాలకు రాజకుమారుడిగా పిలిచే బుధుడు ఫిబ్రవరి 27వ తేదీన కుంభరాశిలో ప్రవేశించడం ఆ రాశులకు మలుపు తిప్పనుంది.
గ్రహాలకు రాజకుమారుడైన బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ముఖ్యంగా 5 రాశులపై ఫిబ్రవరి 27 నుంచి ఊహించని విధంగా ఉంటుంది. అదృష్టం మారిపోతుంది. దశ తిరిగి అమితమైన లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి.
బుధుడి గోచారంతో ఏ రాశులపై ప్రభావం
సింహ రాశి
బుధుడి రాశి పరివర్తనం లేదా బుధ గోచారం ప్రభావంతో ఈ రాశివారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 15 మధ్యలో ఏదైనా కీలకమైన పని పూర్తవుతుంది. బుధ గోచారం వల్ల వ్యాపారంలో భారీ లాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశం లభిస్తుంది.
ధనస్సు రాశి
మీ కుటుంబంలో బంధాలు పటిష్టంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అంతా బాగుంటుంది. మీకు అన్నింటా విజయం కలుగుతుంది. పని నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ముఖ్యంగా ఊహించని ధనలాభం కలుగుతుంది.
వృషభ రాశి
బుధుడి గోచారంతో జీవితంపై ఊహించని ప్రభావం పడుతుంది. కుండలిలో ఒకేసారి అనుకోని ధనలాభం కురుస్తుంది. ఏదైనా పెద్ద వాహనం లేదా సంపదను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలువైపులా కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
కన్యా రాశి
ఉద్యోగులకు ఈ గోచారం ప్రభావం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యారంగంలో పనిచేసేవారికి విజయం సంక్రమిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు చాలా బాగుంటుంది. అంతా అనుకూలించి శుభవార్తలు వింటారు.
మీన రాశి
బుధుడి గోచారం ప్రభావం ఈ రాశివారిపై చాలా బాగుంటుంది. విదేశీ యాత్ర చేసే కల సాకారమౌతుంది. ఏదైనా పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగావకాశం లభిస్తుంది. ప్రస్తుతం చేసే ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, పదోన్నతి యోగం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook