Mercury transit 2023: బుధ గ్రహ గోచారంతో త్రిగ్రహ యోగం, రేపట్నించి ఆ 3 రాశులకు తీవ్ర ఇబ్బందులు

Mercury transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2023, 06:40 AM IST
Mercury transit 2023: బుధ గ్రహ గోచారంతో త్రిగ్రహ యోగం, రేపట్నించి ఆ 3 రాశులకు తీవ్ర ఇబ్బందులు

Mercury transit 2023: గ్రహాల గోచారం ప్రభావం సాధారణంగా కొన్ని రాశులపై ప్రతికూలంగా, మరి కొన్నిరాశులపై అనుకూలంగా ఉంటుంది. మార్చ్ 31వ తేదీన బుధ గ్రహం మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా మేషరాశిలో బుధ, శుక్ర, రాహు గ్రహాల యుతితో త్రిగ్రహ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుంది...

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఒక్కొక్క రాశిలోకి మారుతుంటుంది. ధనం, బుద్ధి, వ్యాపారానికి ప్రతీకగా పిలిచే బుధగ్రహం మార్చ్ 31వ తేదీన మేషరాశిలో ప్రవేశిస్తుంది. బుధ గోచారంతో మేషరాశిలో శుక్ర, రాహు గ్రహాల యుతి ఏర్పడనుంది. ఎందుకంటే మేషరాశిలో రాహువు, శుక్రుడు అప్పటికే ఉన్నారు. ఫలితంగా మేషరాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడనుంది. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపించినా కొన్ని రాశులకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

బుధ గోచారంతో ఈ రాశులకు తీవ్ర ఇబ్బందులు

వృషభ రాశి

వృషభరాశి జాతకులకు త్రిగ్రహ యోగం ప్రతికూలంగా ఉండనుంది. ఈ జాతకం వారికి ధనలాభం కలిగినా పెరిగిన ఖర్చులతో బడ్జెట్ అస్తవ్యస్థమౌతుంది. బంధుత్వంలో ఒకరి నుంచి మోసం ఎదురౌతుంది. లేదా మిత్రుడు, భాగస్వామి మోసం చేయవచ్చు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రత్యేకించి రిస్క్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయవద్దు. వివాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు ఈ సమయం కొద్దిగా నష్టదాయకంగా ఉండవచ్చు. ఈ యోగం ఈ జాతకుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొత్త పనులు ప్రారంభించవద్దు. పెట్టుబడులు నష్టాల్ని కలగజేస్తాయి వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలి. లేకపోతే ప్రమాదాలు జరగవచ్చు.

వృశ్చిక రాశి

రాహు, బుధ, శుక్ర గ్రహాలతో ఏర్పడే త్రి గ్రహ యోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు  నష్టం కలగవచ్చు. ఈ జాతకులకు కోర్టు వ్యవహారాలు ఇబ్బందిగా మారుతాయి. వైఫల్యం కూడా ఎదురౌతుంది. ఆర్ధిక పరిస్థితి అంతగా బాగుండదు. జాగ్రత్తగా లేకపోతే అప్పులు తీసుకోవల్సి వస్తుంది. 

Also read: Grah Gochar 2023: రేవతి నక్షత్రంలో కలుసుకున్న బుధుడు-బృహస్పతి.. ఈ 6 రాశుల ఇంటిపై నోట్ల వర్షం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News