Mars Transit 2023: మంగళ గ్రహం గోచారంతో ఈ మూడు రాశులకు డిసెంబర్ 27 నుంచి కనకవర్షం

Mars Transit 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా వివిధ రాశులపై ఒక్కోలా ప్రభావం కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2023, 08:04 AM IST
Mars Transit 2023: మంగళ గ్రహం గోచారంతో ఈ మూడు రాశులకు డిసెంబర్ 27 నుంచి కనకవర్షం

Mars Transit 2023: హిందూమతంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని యువరాజుగా, శనిని న్యాయ దేవతగా పిలుస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని సేనాపతిగా అభివర్ణిస్తారు. అందుకే మంగళ గ్రహం గోచారానికి సైతం విశేష ప్రాధాన్యత ఉంటుంది. 

హిందూమతం ప్రకారం మంగళ గ్రహం గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులవారికి జీవితమంతా ఆనందమయంగా ఉంటుందంటారు. ఈ ఏడాది చివరిలో కొంతమంది జీవితాల్లో ఈ ప్రభావం చూడవచ్చు. మంగళ గ్రహం గోచారం వల్ల అత్యంత లాభం కలగనుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సేనాపతి మంగళ గ్రహం డిసెంబర్ 27వ తేదీ రాత్రి 11 గంటల 40 నిమిషాలకు రాశి పరివర్తనం చెంది ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడినా కొన్ని రాశులవారికి మాత్రం అత్యంత లాభదాయకంగా ఉండనుంది. మంగళ గ్రహం గోచారంతో ఏయే రాశులకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం..

వృశ్చిక రాశి జాతకులకు మంగళ గ్రహం అత్యంత లాభదాయకం కానుంది. ఈ రాశి అధిపతి కూడా మంగళ గ్రహం అయినందున మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. చాలా విషయాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆకశ్మిక ధనలాభముంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే అవకాశముంటుంది. 

మేష రాశి జాతకులకు డిసెంబర్ 28 నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణానికి పూర్తి అవకాశాలుంటాయి. ముఖ్యంగా విద్యార్ధులకు అనువైన సమయం. మంగళ గ్రహం గోచారంతో చాలా అనుకూలమైన పరిస్థితులుంటాయి.

తులా రాశి జాతకులకు మంగళ గ్రహం రాశి పరివర్తనం కారణంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. అనుకోని విధంగా కలిసొచ్చే సంపదతో లాభం పొందుతారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ జాతకస్తులకు ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. 

Also read: Happy Christmas: మీ బంధుమిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News