Mars Ketu Conjunction 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు, గ్రహాల సంయోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఇది కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభంగానూ ఉంటుంది. ఈ నెల 16న అంగారకుడు మిథునరాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశించాడు. ఈ సమయంలోనే కుజుడు, కేతువు కలిసి అశుభకరమైన నవపంచం యోగాన్ని ఏర్పరిచాయి. ఈ యోగం 4 రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులపై చెడు ప్రభావం
మేషం (Aries): నవపంచం యోగం వల్ల మేషరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు. అందుకే ఇతరులతో కలిసి బిజినెస్ చేయకండి. ఉద్యోగులకు కూడా ఈ సమయం అంతగా కలిసిరాదు.
వృషభం (Taurus): నవపంచం యోగం వృషభ రాశి వారికి కూడా అశుభ ఫలితాలనిస్తుంది. అనారోగ్యం బారిన పడతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశముంది. బంధువులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టాలు చవిచూస్తారు. ఈ సమయంలో గర్బిణీలు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం (Cancer): నవపంచం యోగం వల్ల వీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు ఓడిపోవచ్చు కూడా. కుటుంబంలోని స్త్రీల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం మీకు పెద్దగా కలిసిరాదు.
వృశ్చికం (Scorpio): ఈ రాశివారికి నవపంచం యోగం అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఈ సమయంలో వృశ్చికరాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయంలో గాయపడే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త డీల్ కుదుర్చుకోకండి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.
పరిహారం: నవపంచం యోగం వల్ల ఏర్పడే ఇబ్బందులను తొలగించడానికి కేతువు, అంగారకుడి బీజ మంత్రాలను జపించండి. అదే విధంగా మంగళవారం నాడు ఉపవాసం ఉండి... హనుమంతుడిని పూజించండి. దీంతో ఆంజనేయుడు మిమ్మిల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు.
Also Read: Shani Margi 2022: అక్టోబరు 23న శని గమనంలో పెను మార్పు...మూడు నెలల పాటు ఈ 5 రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook