Mangal Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం

Mars Transit In Sagittarius 2023: గ్రహాల కమాండరైన అంగారకుడు న్యూ ఇయర్ కు ముందు ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడు సంచారం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 12:31 PM IST
Mangal Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం

Mangal Gochar iin Dhanu 2023: అష్టగ్రహాల్లో అంగారకుడు ఒకటి. ఇది సూర్యుడి నుంచి దూరంలో నాలుగో గ్రహం. దీనినే రెడ్ ఫ్లానెట్,  గ్రహాల కమాండర్ అని కూడా పిలుస్తారు. ఇతడి రాశి మార్పు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ధైర్యాన్ని ఇచ్చే కుజుడు ఈ నెల చివరిలో అంటే డిసెంబరు 27న ధనస్సు రాశిలో సంచరించబోతున్నాడు. అంగారకుడు ధనస్సు రాశి ప్రవేశం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి
మార్స్ సంచారం ఇదే రాశిలో జరగబోతోంది. అది ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మీకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ జీవితంలో సంతోషం కలుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. 
మేషరాశి
అంగారకుడు ధనస్సు రాశి ప్రవేశం మేషరాశి వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడుతోంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళతారు. 
సింహరాశి
కుజుడు రాశి మార్పు వల్ల సింహరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. లవ్ సక్సెస్ అవుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also Read: Shani Gochar 2024: వచ్చే ఏడాది శని గమనంలో పెను మార్పులు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News