Mars Transit 2022: వచ్చే నెలలో కుజుడి స్థానంలో పెను మార్పులు.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!

Mars Transit 2022: అక్టోబరు నెలలో అంగారకుడి స్థానంలో రెండు పెను మార్పులు రాబోతున్నాయి. దీని ప్రభావం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2022, 09:10 AM IST
Mars Transit 2022: వచ్చే నెలలో కుజుడి స్థానంలో పెను మార్పులు.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!

Mars Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ధైర్యం, శక్తి, ఆస్తికి కారకుడు కుజుడు. ఈ గ్రహం అక్టోబరు 16న మిథునరాశిలో (Mars Transit in Gemini 2022) సంచరించబోతుంది. మళ్లీ 15 రోజుల తర్వాత అంటే అక్టోబరు 30న అదే రాశిలో తిరోగమనం చేయనుంది. నవంబరు 13 వరకు రివర్స్ లోనే కదులుతుంది. ఈ విధంగా ఒకే నెలలో కుజుడు స్థానంలో రెండు మార్పులు మెుత్తం అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఏ రాశివారికి అంగారకుడి మార్పు మరియు తిరోగమనం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

అంగారక సంచారం ఈ రాశుల వారికి శుభప్రదం
మేషం (Aries): కుజుడు మార్పు మరియు తిరోగమనం మేష రాశి వారికి ధైర్యాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి సవాళ్లనైనా అధిగమిస్తారు. మీ పనిని అందరూ మెచ్చుకుంటారు. లక్ తో మీకు ప్రమోష్ వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. 
వృషభ రాశి (Taurus): కుజుడు స్థానంలో మార్పుల వల్ల వృషభ రాశి వారికి భారీ లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా తీసుకోండి. 
సింహం (Leo): అంగారకుడి సంచారం సింహరాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. లైఫ్ లో ఆనందం ఉంటుంది. ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.

కన్య (Virgo): ఈ రాశివారు మీ రంగంలో రాణిస్తారు. జాబ్ వస్తుంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మెుత్తం మీద ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి అనేక రంగాలలో అంగారక సంచారం లాభాలను ఇస్తుంది. సంబంధాలు మెరుగుపడుతాయి.వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ సమయంలో మీ పనిని తొందరగా పూర్తి చేయగలుగుతారు. 

Also Read: Planet Changes October 2022: అక్టోబర్‌లో రాశిని మార్చబోతున్న ఆరు గ్రహాలు.. ఈ 6 రాశులవారిపై పెను ప్రభావం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News